• తాజా వార్తలు

ఫేస్‌బుక్ మ‌న కాల్స్, ఎస్ఎంస్ డేటాను ఏ మేర‌కు క‌లెక్ట్ చేసిందో తెలుసుకోవ‌డం ఎలా?

యూజ‌ర్ల స‌మాచారాన్ని థ‌ర్డ్ పార్టీ సైట్ల‌కు ఇచ్చి సమాచార దుర్వినియోగం చేసిందంటూ ఫేస్‌బుక్ మీద ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు అనుకూలంగా ప్ర‌చారానికి వాడుకునేందుకు లక్ష‌ల మంది ఫేస్‌బుక్ యూజ‌ర్ల స‌మాచారాన్ని కేంబ్రిడ్జి అన‌లిటికా అనే సంస్థ యూజ‌ర్లకు తెలియ‌కుండా ఫేస్‌బుక్‌ను సేక‌రించ‌డం పెద్ద వివాదంగా మారింది.  స‌మాచారం దుర్వినియోగం అవ్వ‌డం నిజ‌మేనంటూ ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బ‌ర్గ్ ఒప్పుకోవడంతో అత‌నిమీద  విచార‌ణ కూడా జ‌రుపుతున్నారు. అన్ని దేశాలూ దీనిమీద అల‌ర్ట‌య్యాయి. అయితే ఫేస్‌బుక్ మీ వివ‌రాల‌నే కాదు మీ స్మార్ట్‌ఫోన్‌లో వ‌చ్చే కాల్స్‌ను, ఎస్ఎంఎస్‌ల‌ను కూడా ట్రాక్ చేస్తుంద‌ని తాజాగా తేలింది. 
ఏమేం ట్రాక్ చేస్తుంది? 
ఫేస్‌బుక్ మీ కాల్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఆ కాల్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎంత సేపు మాట్లాడారు? వ‌ంటి వివ‌రాల‌న్నీ రికార్డ్ చేస్తుంది. అంతేకాదు ఎస్ఎంఎస్ రికార్డ్‌లు కూడా ట్రాక్‌చేస్తుంది. అస‌లు ఫేస్‌బుక్ ఇప్ప‌టివ‌ర‌కు ఇలా మీ వివ‌రాలు ఎంత వ‌ర‌కు సేక‌రించిందో తెలుసుకోవ‌డానికి ఓ ట్రిక్ ఉంది. ఫేస్‌బుక్ మీ  ద‌గ్గ‌ర నుంచి క‌లెక్ట్ చేసిన డిటెయిల్స‌న్నింటినీ ఓ జిప్ ఫైల్ రూపంలో మీరు పొంద‌వ‌చ్చు.

1. మీ డెస్క్‌టాప్‌లో బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి https://register.facebook.com/download/టైప్ చేయండి.

2. ఇప్పుడు ఇది మీ ఫేస్‌బుక్ అకౌంట్ సెట్టింగ్స్ పేజీకి వెళ‌తారు. అక్క‌డ General Account Settings ఆప్ష‌న్ కింద చివ‌రిలో Download a copy అనే లింక్ కనిపిస్తుంది. 

3.లింక్ క్లిక్‌చేయ‌గానే  Download your information పేజీ వ‌స్తుంది. దీనిలో Download Archive అని క‌నిపించే గ్రీన్ క‌ల‌ర్ బ‌టన్ నొక్కాలి..

4.ఇప్ప‌డు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయి మీ పాస్‌వ‌ర్డ్ అడుగుతుంది. పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్‌చేయ‌గానే మీ డేటా డౌన్‌లోడ్‌కి ర‌డీ అవుతుంది. 

5, ఇప్పుడు మీరు జిప్ ఫైల్‌ను డెస్క్‌టాప్ మీద‌కి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

6.డౌన్‌లోడ్ పూర్త‌య్యాక  contact_info’ HTML’ మీద క్లిక్ చేసి ఫైల్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేయొచ్చు. అందులో మీరు చేసిన మెసేజ్‌లు, మీ కాంటాక్స్ట్‌, పోస్ట్‌లు,లైక్స్‌, వీడియో అన్నీ ఉంటాయి. వీట‌న్నింటినీ కొన్నేళ్లుగా ఫేస్‌బుక్ సేవ్ చేస్తుందన్న‌మాట‌.


 

జన రంజకమైన వార్తలు