• తాజా వార్తలు

మ‌న ఫోన్ నంబ‌ర్ ద్వారా మ‌న ఫ్రొఫైల్ దొరికేలా ఫేస్‌బుక్ సెట్ చేసిందా?

ఫేస్‌బుక్.. ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే సోష‌ల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌. అయితే ఈ శ‌క్తివంత‌మైన సోష‌ల్ మీడియా యాప్‌ను మ‌నం్ సాధార‌ణంగా ఫోన్ నంబ‌ర్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సైన్ ఇన్ అవుతాము. ఎక్కువ‌మంది ఫోన్ నంబ‌ర్ ద్వారానే ఫేస్‌బుక్‌ను సైన్ ఇన్ చేస్తారు అంతేకాదు ఫోన్ నంబ‌ర్‌నే ఎక్కువ‌మంది పాస్‌వ‌ర్డ్‌గా కూడా పెట్టుకుంటారు. మ‌రి ఎవ‌రైనా మ‌న స్నేహితులు మ‌న కోసం ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేస్తే సాధార‌ణంగా మ‌న పేరు టైప్ చేసి సెర్చ్ చేస్తారు. అయితే పేరు టైప్ చేయ‌కుండా నేరుగా ఫోన్ నంబ‌ర్ టైప్ చేయ‌డం ద్వారా కూడా మ‌న ఫ్రొఫైల్‌ను రీచ్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఫేస్‌బుక్ ఇలా సెట్ చేసిందా?

మిస్ యూజ్ కాకుండా...
ఫేస్‌బుక్ అంటే అంద‌రికి అందుబాటులో ఉండే యాప్. దీని ద్వారా మ‌నం ఎక్కువ‌మందికి చేరువుతాం. అయితే అజాగ్ర‌త్త‌గా ఉంటే మాత్రం విలువైన స‌మాచారం మిస్ యూజ్ కావ‌డం ఖాయం. అందుకే ఫేస్‌బుక్ మ‌న స‌మాచారానికి ఎక్కువ విలువ ఇస్తూ ప్రొటెక్ష‌న్ ఇస్తూ ఉంటుంది. టూ వే అథంటికేష‌న్‌ను మ‌న‌కు స‌జిస్ట్ చేస్తుంటుంది. అంటే మ‌నం పాస్‌వ‌ర్డ్ పెట్ట‌కున్నా కూడా పాస్‌వ‌ర్డ్ ద్వారా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవ‌చ్చు. అంటే మీరు రెగ్యుల‌ర్‌గా ఓపెన్ చేసే కంప్యూట‌ర్ నుంచి కాక‌.. లేదా రెగ్యుల‌ర్ వాడే ప్ర‌దేశం నుంచి కాకుండా వేరో ప్ర‌దేశం నుంచి ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేస్తే మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. మీరు ఓకే చేస్తే మాత్రమే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అంటే మీకు అకౌంట్ అద‌న‌పు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉప‌యోగ‌ప‌డుతుంది ఈ ఫోన్ నంబ‌ర్‌. 

ఫ్రొఫైల్ దొరికేస్తుంది
అయితే ఫోన్ నంబ‌ర్‌ను ఫేస్‌బుక్ పాస్‌వ‌ర్డ్‌గా యూజ్ చేసుకోవ‌డం ద్వారా అద‌న‌పు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది అక్క‌డి వ‌ర‌కూ ఫ‌ర్వాలేదు కానీ ఒక ఇబ్బంది ఉంది. అదే మ‌న ఫ్రొఫైల్ ఫైండింగ్‌. ఎవ‌రైనా మ‌న ఫోన్ నంబ‌ర్‌ను సెర్చ్‌లో టైప్ చేస్తే చాలు మ‌న ఫ్రొఫైల్ దొరుకుతుంది. ఒక ర‌కంగా ఇది ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే.అంతేకాదు మిమ్మ‌ల్ని యాడ్స్ ద్వారా టార్గెట్ చేయ‌డం కోసం కూడా ఇలా ఫోన్ నంబ‌ర్‌ను ఉప‌యోగించుకునే ప్ర‌మాదం కూడా ఉంది. అంటే ఈ టూవే అథంటికేష‌న్ వ‌ల్ల లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఫేస్‌బుక్ సెట్టింగ్స్‌లో మీ ఫోన్ నంబ‌ర్ ద్వారా ఎవ‌రు మీ ఫ్రొపైల్‌ను చూడొచ్చు అనే ఆప్ష‌న్ డిఫాల్ట్‌గా ఉంటుంది.. దీనికి అంద‌రూ ఆప్ష‌న్ ఉంటుంది.. దాన్ని మీరు మార్చి స్నేహితులు లేదా ప్రైవేట్ అని పెట్టేస్తే చాలు ఫోన్ నంబ‌ర్ ద్వారా మీ ఫ్రొఫైల్ దొర‌క‌దు. 

జన రంజకమైన వార్తలు