ఫేస్‌బుక్‌లో పోస్ట్ నచ్చితే ఓ లైక్ వేసుకుంటాం. మరీ బాగుందనిపిస్తేనో లేదంటే ఎవరినయినా విష్ చేయాలనిపిస్తేనో కామెంట్ పెడతాం. కామెంట్స్‌లో బోల్డన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు. మీరు గుర్తించనివీ కొన్ని కచ్చితంగా ఉంటాయి. అవేమిటో వాటి కథేంటో చూడండి మరి..
1. యాడ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్
ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్ కామెంట్‌లో వచ్చిన కొత్త ఫీచర్ ఇది. కంగ్రాట్స్ లాంటి కొన్ని పదాలను ఫేస్‌బుక్ కామెంట్‌లో టైప్ చేసినప్పుడు ఆ పదం కలర్ మారిపోతుంది. దాన్ని ఎప్పుడయినా టచ్ చేసి చూశారా. కలర్ మారిన ఆ పదాన్ని క్లిక్ చేయండి బుడగలు ఎగురుతున్నట్లు, సెలబ్రేషన్స్‌లాగా యానిమేషన్ వస్తుంది. ఏదైనా సంతోషపూర్వకమైన, అభినందించే పదాలు మనం కామెంట్‌లో టైప్ చేస్తే ఈ యాడ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. Best Wishes, Congrats or Congratulations, You’re the best, Bff or bffs, Xo or XOXO, Wonderful time, You got this వీటిలో ఏది మీరు కామెంట్‌లో టైప్ చేసినా ఈ ఎఫెక్ట్ వస్తుంది. ఈసారి ట్రై చేసి చూడండి.
2. టెక్స్ట్ ఎఫెక్ట్ యానిమేషన్ తొలగించడం
పైన చెప్పినట్లు కలర్‌ఫుల్‌గా, యానిమేటెడ్‌గా మీ టెక్స్ట్ మారకూడదనుకుంటున్నారా? దానికీ ఛాయిస్ మీదే. కామెంట్ తర్వాత ఉన్న త్రీ డాట్స్ మెనూను క్లిక్ చేసి Remove text effectsను క్లిక్ చేయండి. అదే మొబైల్ యాప్ అయితే కామెంట్‌ను లాంగ్ ప్రెస్ చేసి Remove Text Effects ఆప్షన్ క్లిక్ చేయాలి.
3. యాడ్ రియాక్షన్
ఇది దాదాపు అందరికీ తెలిసిందే. లైక్ బటన్‌ను ప్రెస్ చేసి పట్టుకుంటే like, love, Haha, Wow, Sad, Angry అనే ఆరు ఎమోజీలు కనిపిస్తాయి. దానిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. అయితే ఈ ఎమోజీ కామెంట్ సెక్షన్‌లో కాకుండా లైక్ బటన్ దగ్గరే చూపిస్తుంది. కానీ ఇది కూడా కామెంట్‌లో భాగమే.
4. ఎడిట్ కామెంట్స్
పొరపాటున కామెంట్‌లో ఏదైనా తప్పు దొర్లిందనుకోండి. అయ్యో అనుకుని వదిలేస్తారు చాలామంది. దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. కామెంట్ తర్వాత ఉన్న త్రీడాట్ ఐకాన్ క్లిక్ చేసి మెనూలో EDITని క్లిక్ చేసి కామెంట్‌ను ఎడిట్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్‌లో అయితే కామెంట్‌ను హోల్డ్ చేసి పట్టుకుంటే మెనూ వస్తుంది. దానిలో ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీ పాత కామెంట్ ప్లేస్‌లో ఎడిట్ అయిన కామెంట్ మాత్రమే కనిపస్తుంది.
5. టెక్స్ట్ ఫార్మాటింగ్
ఫేస్‌బుక్ కామెంట్‌ను అక్కడున్న ఫాంట్‌లోనే రాయాల్సి ఉంటుంది. అయితే దీనికి కొంత ఫార్మాట్ చేసుకునే వెసలుబాటు ఉంది. ఫాంట్‌ను బోల్డ్ చేయడం, ఇటాలిక్‌గా మార్చుకోవచ్చు. అయితే వాట్సాప్‌లో మాదిరిగా ఈ ఫీచర్ ఫేస్‌బుక్‌లో డైరెక్ట్‌గా లేదు. మీరు థర్డ్ పార్టీ యాప్స్‌తో ఈ ఫార్మాట్ ఉపయోగించి టెక్స్ట్‌ను ఫార్మాట్ చేసుకోవచ్చు. దాన్ని కాపీ చేసి కామెంట్స్‌లో పేస్ట్ చేయొచ్చు.
6. కామెంట్ ర్యాంకింగ్
ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టేటప్పుడు దాన్ని ఎవరు చూడాలో సెట్టింగ్స్‌లో మనం ముందే సెట్ చేసుకుంటాం. అందరూ చూడదగినది అయితే Public అని పెట్టుకుంటాం. అయితే ఇలాంటప్పుడు మీ పోస్ట్‌కి వచ్చే కామెంట్స్‌లో రిలవెంట్ కామెంట్స్ మాత్రమే టాప్‌లో కనపడాలనుకుంటే కామెంట్ ర్యాంకింగ్ (Comment Ranking) సెట్టింగ్ పెట్టుకోవచ్చు.
ఫేస్‌బుక్ వెబ్‌లో పైన ఉన్న చిన్న డౌన్ యారోను క్లిక్ చేసి సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఎడమవైపున ఉన్న Public Postsను క్లిక్ చేయాలి. తర్వాత Comment Rankingలోకి వెళ్లి దాన్ని On చేసుకోవాలి. .
అదే మొబైల్ యాప్ అయితే యాప్ ఓపెన్ చేసి కుడివైపు పైన ఉన్న త్రీ బార్ మెనూను టాప్ చేయాలి. కిందికి స్క్రోల్ డౌన్ చేసి సెట్టింగ్స్ & ప్రైవసీలోకి వెళ్లాలి. Account Settingsలోకి వెళ్లి Public Postsని క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ డౌన్ చేసి Comment Rankingను ఆన్ చేయాలి.
7. పబ్లిక్ కామెంట్స్‌ను కస్టమైజ్ చేయడం
మీ పోస్ట్‌కు అందరూ కామెంట్ చేయడం మీకు నచ్చదా? అయితే పబ్లిక్ కామెంట్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫేస్‌బుక్ వెబ్‌లో పైన ఉన్న చిన్న డౌన్ యారోను క్లిక్ చేసి సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడమవైపున ఉన్న Public Postsను క్లిక్ చేయాలి. తర్వాత privacy settingలోకి వెళ్లి Public, Friends of friends, Friendsలో మీ పోస్ట్‌కు ఎవరు కామెంట్ పెట్టాలో సెలెక్ట్ చేసుకుంటే చాలు.