ఈ-కామర్స్ గురించి తెలిసినవారికి అమెజాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ బిజినెస్‌లో తిరుగులేని సంస్థ ఇది. ఒరిజినల్ ప్రొడక్ట్స్, ప్రాపర్ డెలివరీకి అమెజాన్ పెట్టింది పేరు అనిచెబుతారు. అంతగా అమెజాన్ సిస్టమైజ్ అయి ఉంది. అయితే ఒకవేళ మీరు అమెజాన్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు ఏదైనా ఇబ్బంది తలెత్తినా, ప్రొడక్ట్ తప్పుగా వచ్చినా, డెలివరీలో ప్రాబ్లం ఏర్పడినా,డిస్కౌంట్ అప్లయి కాకపోయినా, క్యాష్‌బ్యాక్ రాకపోయినా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే పరిష్కరిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ చాలా టైం పడుతుంది. ఫోన్లో గంటలకొద్దీ సమయం వెచ్చించాలి అనుకుంటున్నారా? అయితే మీరు తక్షణం అమెజాన్ కస్టమర్ కేర్‌కు కనెక్ట్ కావడానికే ఈ చిట్కా.వాడుకోండి మరి.
ప్రొడక్ట్ డెలివరీ అయ్యాక మాట్లాడాలంటే..
1. అమెజాన్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి
2. your Ordersను క్లిక్ చేయండి
3. మీ రీసెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి.
4. Return your Orderను క్లిక్ చేసి రీజన్ సెలెక్ట్ చేయండి
5. మీరు ఆర్డర్ రిటర్న్ లేదా రీప్లేస్‌చేయగానే మీరు కస్టమర్ కేర్‌తో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే Return >> Need Help >> Phone ను క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ యాడ్ చేయండి.
6. మీ నెంబర్‌కు కాల్ వస్తుంది. రిసీవ్ చేసుకోండి
7. వెంటనే మీ కాల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కి కనెక్ట్ అవుతుంది. మీ ప్రాబ్లమ్ చెప్పి పరిష్కారం పొందండి.
ఈ పద్ధతిలో మీరు కస్టమర్ కేర్‌కు కాల్ చేయక్కర్లేదు. వాళ్లే మీకు కాల్ చేసి మాట్లాడతారు.
ఆర్డర్ డెలివరీ కాకముందే సాయం కావాలంటే..
అమెజాన్ అకౌంట్‌తో లింకయి ఉన్న మీ ఫోన్ నెంబర్ నుంచి 1800 3000 9009 టోల్ ఫ్రీ నెంబర్‌కు గానీ అమెజాన్ పెయిడ్ హెల్ప్ నెంబర్ 022-30430101కిగానీ కాల్ చేస్తే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తక్షణం లైన్లోకి వస్తారు.
* అమెజాన్ యాప్ లేదా సైట్‌లో లాగిన్ అయి అమెజాన్ హెల్ప్ టాపిక్స్ లోకి వెళ్లి నేరుగా మీ ప్రాబ్లం ఏమిటో దానికి క్లిక్ చేసి కూడా పరిష్కారం పొందవచ్చు.