గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతివారికీ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది. ఈ డ్రైవ్‌లో 15జీబీ వరకు డేటా స్టోర్ చేసుకోవచ్చు. మన ఫోన్ లేదా పీసీ, మ్యాక్‌లో ఉన్న డేటాను గూగుల్ డ్రైవ్‌తో సింక్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఎక్కడి నుంచయినా యాక్సెస్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇందుకోసం మీ మొబైల్ లేదా పీసీ, ల్యాపీకి డేటా కనెక్షన్ ఉండాలి. అలా డేటా కనెక్షన్ లేకపోయినా డ్రైవ్‌లోని ఫైల్స్‌ను ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి మార్గాలున్నాయి. ఆ టిప్స్ మీ కోసం..
పీసీలో వాడుకోవాలంటే
1. గూగుల్ డ్రైవ్ ఫైల్స్‌ను ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి మీరు తప్పనిసరిగా క్రోమ్ బ్రౌజర్‌నే వాడాలి.
2. మీ పీసీలో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్‌చేసి chrome.google.com/webstoreలోకి వెళ్లి Google Docs offline Chrome extensionను యాడ్ చేసుకోండి.
3. ఇప్పుడు drive.google.comలోకి వెళ్లి మీ స్క్రీన్‌కి పైన కనిపించే గేర్ ఐకాన్‌ను క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
4. Sync Google Docs, Sheets, Slides & Drawings files to this computer so that you can edit offline. అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని ముందున్న బాక్స్‌లో టిక్ చేయండి.
5. అంతే ఇక మీరు మీ గూగుల్ డ్రైవ్‌లో ఉన్న డాక్యుమెంట్స్, స్లైడ్స్, షీట్స్, డ్రాయింగ్ ఫైల్స్‌ను ఆఫ్‌లైన్‌లోనూ యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదు వాటిని ఎడిట్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైస్‌ల్లో వాడుకోవాలంటే
ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ యూజర్లు గూగుల్ డ్రైవ్‌ను ఆఫ్‌లైన్‌లో వాడుకోవాలంటే ముందుగా గూగుల్ డ్రైవ్ యాప్‌లోకి వెళ్లాలి. తర్వాత మీ ఫైల్ పక్కనున్న More options ఐకాన్‌ను సెలెక్ట్ చేసి Available offline ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.’
మీకు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఫైల్స్‌ను లొకేట్ చేయాలంటే Google Drive appలోకి వెళ్లి hamburger మోనూలోకి వెళ్లి ఆఫ్‌లైన్‌ను సెలెక్ట్ చేయాలి.
కొన్నింటికే పరిమితం
అయితే గూగుల్ డ్రైవ్‌లో స్టోర్‌చేసిన అన్ని రకాల డేటాను ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయంలేం. డాక్యుమెంట్స్, స్లైడ్స్, స్ప్రెడ్ షీట్స్ వంటివాటిని మాత్రమే యాక్సెస్ చేయగలం. ఫొటోలు, వీడియోల వంటివి ఆఫ్‌లైన్‌లో కూడా యాక్సెస్‌చేయడం సాధ్యం కాదు. అంతేకాదు మీ సిస్టం ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉన్నా కూడా ఈ ఆఫ్‌లైన్ యాక్సెస్ వర్కవుట్ కాదు. ఎందుకంటే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్లు ఏవీ ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పనిచేయవు.