మీ ఫోన్‌ను ఏదో ఒక సందర్భంలో ఫ్రెండ్స్‌కో, ఫ్యామిలీ మెంబర్స్‌కో ఇవ్వాల్సి రావచ్చు. మీ ఇంట్లో పిల్లలు ఏదో గేమ్ ఆడుకోవడానికి అడగొచ్చు. లేదంటే కాల్ చేసుకోవడానికి ఎవరైనా అడగొచ్చు. అలాంటప్పుడు ఇవ్వకుండా ఉండడం కుదరదు. అలాగని స్మార్ట్‌ఫోన్ ఇస్తే అందులో మన వ్యక్తిగత విషయాలన్నీ వారి కళ్లబడే ప్రమాదముంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే ఒక ఫీచర్ ఉంది. దాని పేరే స్క్రీన్ పిన్నింగ్ (Screen pinning) లేదా పిన్ విండోస్.
ఏమిటి ఉపయోగం?
ఈ పిన్ విండోస్ లేదా స్క్రీన్ పిన్నింగ్ ఫీచర్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్ లాక్ చేసినా కూడా ఏదో ఒక ఫీచర్ పనిచేసేలా చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు పిల్లలకు గేమ్ ఆడుకోవడానికి ఇవ్వాలనుకున్నారనుకోండి దాన్ని మాత్రమే పని చేసేలా చేసి మిగిలిన ఫోన్‌ను లాక్ చేసేయొచ్చు. ఇది మీ ప్రైవసీకి మంచి సేఫ్‌గార్డ్ కదా. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆ తర్వాత వచ్చిన ఓఎస్‌తో నడిచే ఫోన్లన్నింటిలోనూ ఈ పిన్ విండోస్ ఫీచర్ పని చేస్తుంది.
ఎలా వాడుకోవాలి?
1. మీ ఫోన్‌లో Settings ఓపెన్ చేయండి.
2. Security & Lock screen ఆప్షన్‌కి వెళ్లండి.
3. అందులో కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే Screen Pinning ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని టర్న్ ఆన్ చేయండి.
4. దానికింద Ask for unlock pattern before unpinning అని ఉంటుంది. దాన్ని కూడా ఆన్ చేయండి. మీరు యాప్‌ను అన్‌పిన్ చేయడానికి ప్యాట్రన్ లేదా పాస్‌వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
5. ఇప్పుడు మీరు పిన్ చేయాలనుకున్న యాప్‌ను ఓపెన్ చేసి పిన్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి
6. ఇప్పుడు మీ ఫోన్ లాక్ అయి ఉన్నా కూడా మీరు పిన్ చేసిన యాప్‌ను వాడుకోవచ్చు. మీరు దీన్ని అన్‌పిన్ చేస్తేనే మరో యాప్‌ను వాడుకోగలుగుతారు.
శాంసంగ్ లాంటి కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌లో Lock Screen and security> Other security settings> Pin windowsలో ఈ ఫీచర్ ఉంటుంది.