ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో శాంసంగ్ తీసుకొచ్చిన గెలాక్సీ సిరీస్ ఫోన్లలో చాలా ఫీచర్లున్నాయి. చాలాకాలంగా గెలాక్సీ సిరీస్ ఫోన్లు వాడుతున్నవారికి కూడా ఇందులో కొన్ని ఫీచర్ల గురించి తెలియదనే చెప్పాలి. ఆ ఫీచర్లేమిటో, వాటి ఉపయోగాలేమిటో చూద్దాం రండి..
వన్‌హేండెడ్ మోడ్
స్మార్ట్‌ఫోన్ల సైజు ఆరంగుళాలు దాటిపోవడం ఇప్పుడు కామనైపోయింది. కానీ అంత పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్ సింగిల్ హ్యాండ్‌తో ఆపరేట్ చేయాలంటే అందరికీ చేతులు పట్టకపోవచ్చు. అందుకే సింగిల్ హ్యాండెడ్ మోడ్ (smaller మోడ్) తీసుకొచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ సైజ్ సగానికి తగ్గిపోతుంది. అప్పుడు మీరు దాన్ని సులువుగా వాడుకోవచ్చు.
ఫోన్ కింది కార్నర్ నుంచి డయాగ్నల్‌గా స్వైప్ చేస్తే వన్ హేండెడ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. లేదంటే హోం బటన్ మీద మూడుసార్లు ట్యాప్ చేసినా వస్తుంది. Settings > Advanced Features లోకి వెళ్లి One-Handed Modeను యాక్టివేట్ చేసుకోవచ్చు.
గేమ్ టూల్స్
మీరు గేమ్ లవర్ అయితే శాంసంగ్ గేమ్ టూల్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.బ్యాక్ బటన్ పక్కనున్న మెనూ బటన్ నొక్కితే ఈ గేమ్ టూల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి నావిగేషన్ కీస్‌లో దీన్ని కావాల్సిన చోట సెట్ చేసుకోవచ్చు కూడా. గేమ్ టూల్స్ ఫీచర్ ద్వారా మీరు గేమ్ ఆడుతుండగానే ఫుల్ స్క్రీన్ టూగుల్ చేసుకోవచ్చు. అలర్ట్స్‌ను డిజేబుల్ చేయొచ్చు. హోం బటన్ హార్డ్ ప్రెస్‌ను, ఎడ్జ్ డిస్‌ప్లే టచ్ ఏరియాను, బ్రైట్‌నైస్‌ను, నావిగేషన్ కీస్‌ను, స్క్రీన్ టచ్‌లను లాక్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. వీడియో రికార్డ్ చేసుకోవచ్చు.
ఎస్‌వోఎస్ మెసేజ్
ఎస్‌వోఎస్ మెసేజ్ అనే ఫీచర్‌కు మీ జీవితాన్ని కాపాడే శక్తి ఉంది. ముందుగా మీరు సేవ్ చేసుకుని పెట్టుకున్న నాలుగు ఇంపార్టెంట్ కాంటాక్ట్స్‌కి మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈజీగా మెసేజ్ పంపడం ఈ ఎస్‌వోఎస్ మెసేజ్ స్పెషాలిటీ. పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే చాలు ఈ నాలుగు నెంబర్లకు I need help! అని మీ పేరు, నెంబర్‌తో మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా మ్యాప్‌లో చూపించేస్తుంది. దీంతో మీరు ఎమర్జెన్సీలో ఉన్నారని మీ వాళ్లకు వెంటనే అర్ధమవుతుంది. ఎక్కడున్నారో కూడా గుర్తించి వెంటనే అక్కడికి చేరుకోగలుగుతారు. మెసేజ్ పంపడమే కాదు ఫొటో తీయడం, 5 సెకన్ల పాటు ఆడియో రికార్డ్ చేసి పంపే అవకాశం కూడా ఉంది.
Settings > Advanced Featuresలోకి వెళ్లి Send SOS Messagesను క్లిక్ చేస్తే ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు.
స్మార్ట్ లాక్
సెల్‌ఫోన్ ఏదయినా మనం వాడకుండా ఐడల్‌గా ఉంచితే కొన్ని సెకన్లలో లాక్ అయిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో దీన్ని తరచూ అన్‌లాక్ చేయడం చికాకే. అందుకే స్మార్ట్‌లాక్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే స్మార్ట్ వాచ్ లాంటి బ్లూ టూత్ డివైస్‌లతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీ ఫోన్ లాక్ కాకుండా చూస్తుంది.దీంతో మాటిమాటికీ ఫోన్ అన్‌లాక్ చేసే బాధ తప్పుతుంది.
Settings > Lock Screen and Security > Smart Lockలోకి వెళ్లి ఈ ఆప్షన్‌ను వాడుకోవచ్చు.
కస్టమ్ వైబ్రేషన్ ప్యాట్రన్స్
మనకు కావాల్సిన కాంటాక్ట్‌లకు వేర్వేరు రింగ్ టోన్లు ఎలా సెట్ చేసుకుంటామో అలాగేఈ గెలాక్సీ సిరీస్ ఫోన్లలో వైబ్రేషన్స్ కూడా సెట్ చేసుకునే ఫీచర్‌ను రీసెంట్‌గా తీసుకొచ్చింది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా వైబ్రేషన్ ప్యాట్రన్‌ను బట్టి అది కాలా, మెసేజా తెలుసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్స్ స్పెసిఫిక్ వైబ్రేషన్ కూడా పెట్టుకుని వైబ్రేషన్ ప్యాట్రన్‌ను బట్టి కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో గుర్తు పట్టేయొచ్చు.Settings > Sounds and Vibrationsలోకి వెళ్లి దీన్ని సెట్ చేసుకోవాలి. కాంటాక్ట్స్ స్పెసిఫిక్ వైబ్రేషన్ కావాలేంట కాంటాక్ట్ కార్డ్‌లోకి వెళ్లి Edit బటన్‌ను క్లిక్ చేసి View More ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ కింద ఉన్న Vibration Patternను క్లిక్ చేసి సెట్ చేసుకోవాలి.
వైర్‌లెస్ ఛార్జింగ్
చాలా గెలాక్సీ సిరీస్‌లోని చాలా ఫోన్లలో వైర్‌లైస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉందని చాలామందికి తెలియదు. ఛార్జర్ వైర్‌కి ఫోన్‌ను కనెక్ట్ చేసి అవసరమైనప్పుడల్లా దాన్ని పిన్ నుంచి తీసి వాడుకోవడం కంటే ఛార్జింగ్ డాక్ మీద పెట్టి ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడం, కావాలంటే తీసి వాడుకోవడం చాలా ఈజీ కదా.