• తాజా వార్తలు

హార్డ్‌డిస్క్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చినప్పుడు మ‌న‌కు ఇచ్చే 4 వార్నింగ్ కాల్స్‌

సినిమాలు, టీవీ షోలు, గేమ్స్‌, సాఫ్ట్‌వేర్లు ఇలా ప్ర‌తి అంశాన్నీ కంప్యూట‌ర్‌లో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం. రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఈ డేటా పెరుగుతూ ఉంటోంది. ప్ర‌స్తుతం 500 జీబీ హార్డ్ డిస్క్ స‌రిపోక‌.. 1 టీబీ(టెరా బైట్‌- 1024జీబీ) హార్డ్‌డిస్క్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మ‌రికొంద‌రు ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్ డిస్క్‌ల‌ను కొనుక్కుంటున్నారు. ఇతర ఎల‌క్ట్రానిక్ ప‌రికరాల్లానే హార్డ్‌డిస్క్‌కు కూడా ఒక లైఫ్‌స్పాన్ ఉంటుంది. ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ లైఫ్‌స్పాన్ సుమారు 5 నుంచి 10 ఏళ్లు ఉంటే.. ఎక్స్‌ట‌ర్న‌ల్ ప‌రిక‌రాల లైఫ్‌స్పాన్ 3 నుంచి 5 ఏళ్లు ఉంటుంది. ప్ర‌స్తుతం ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయిన త‌రుణంలో.. వీటిని త‌ర‌చూ వినియోగించ‌డం వ‌ల్ల వీటి లైఫ్‌స్పాన్ కూడా తగ్గిపోతోంది. మ‌రి ఈ హార్డ్ డిస్క్‌లు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిందో లేదో తెలుసుకోవ‌డ మెలా?  మ‌రి వీటిని కాపాడ‌ట‌మెలా? అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం!

మొద‌టి సంకేతం: క‌ంప్యూటర్ త‌ర‌చూ మొరాయించ‌డంతో పాటు చాలా నెమ్మ‌దిగా ప‌నిచేస్తుంది. అలాగే స్క్రీన్ కింది భాగంలో నీలం రంగులో క‌నిపిస్తుంది. ఇవి త‌ర‌చూ క‌నిపించ‌వు. ఒక‌వేళ కొత్తగా ఓఎస్‌ను ఇన్‌స్టాల్ చేసినా లేదా విండోస్ సేఫ్ మోడ్‌లో ఉంచినా.. ఈ స‌మ‌స్య‌లు వస్తూ ఉంటే హార్డ్ డ్రైవ్ ఇక చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ట్లే.

రెండో సంకేతం: ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా సేవ్ అయిన ఫైల్స్ ఓపెన్ కాక‌పోవ‌డం, అవి క‌రప్ట్ అయిన‌ట్లు క‌నిపిస్తాయి.

మూడో సంకేతం: ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో మాస్క్ చేసిన కొన్నిహార్డ్ డ్రైవ్‌లోని కొన్ని ప్రాంతాలు హార్డ్ డిస్క్ స‌రిగ్గా లేవ‌నే సంకేతాలు ఇస్తుంటాయి. హార్డ్ డిస్క్‌లో భారీ మొత్తంలో స‌మాచారం ఉన్న‌ప్పుడు వీటిని గుర్తించ‌డం చాలా క‌ష్టం.

విండోస్‌లో ఈ బ్యాడ్ సెక్టార్‌ల‌ను గుర్తించేందుకు My PCలో డ్రైవ్ పార్టీషియ‌న్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు.  My PC మీద రైట్ క్లిక్ చేసి Propertiesలోకి వెళ్లాలి. ఇందులో టూల్స్ ఆప్ష‌న్‌లో  Error checkingని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్టిమైజేష‌న్ కోసం
Optimise and defragment drive మీద క్లిక్ చేయాలి. అలాగే సిస్ట‌మ్ ఫుల్ ఫార్మాట్ చేసే స‌మ‌యంలోనూ విండోస్‌.. ఈ బ్యాడ్ సెక్టార్స్‌ను చెక్ చేస్తుంది. అలాగే chkdsk  క‌మాండ్ ఉప‌యోగించి కూడా ఈ బ్యాడ్ సెక్టార్ల‌ను తెలుసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు