• తాజా వార్తలు

ఫోన్ ఛార్జింగ్ స్లో అవ్వడానికి ప్రధాన కారణాలు వాటికి పరిష్కార మార్గాలు

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉండే ప్రధాన సమస్య ఛార్జింగ్. మనం ఏదో పనికోసం వెళ్లే తొందరలో త్వరగా ఛార్జింగ్ ఎక్కాలని ఆరాటపడితే ఫోన్ అసలు ఛార్జింగ్ ఎక్కదు. దీంతో మనకు ఎక్కడలేని చిరాకువస్తుంటుంది. సాధారణంగా బ్యాటరీలో సమస్యల వల్ల కాని లేక ఫోన్లో ఉన్న సమస్యల వల్ల కాని ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సాధారణంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో యూజర్లకు ఈ ఏడు సమస్యలు ఎదురవుతుంటాయి. మీ ఫోన్ ఛార్జింగ్ స్లోగా ఉన్నట్లయితే మీరు వెంటనే వీటిని ఓ సారి సరిచూసుకోండి.

మీరు మీ ఫోన్ ఛార్జింగ్ మీ పర్సనల్ కంప్యూటర్ ద్వారా కాని ల్యాపీ ద్వారా కాని పెడుతున్నట్లయితే అది వెంటనే బంద్ చేయండి. ఇది చాలా వీక్ ఛార్జింగ్ ని అందిస్తుంది. అలాగే వైర్ లెస్ ఛార్జర్ కూడా బ్యాటరీని అంత త్వరగా ఛార్జ్ కానీయదు. మీరు నేరుగా పవర్ ద్వారా ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం చేయండి.

మీరు ఛార్జింగ్ పెట్టే సమయంలో ఏమైనా యాప్స్ బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతున్నప్పుడు కూడా ఛార్జింగ్ స్లో అయ్యే ప్రమాదముంది. Facebook, Mail, Twitter, whatsapp లాంటి యాప్స్ మీ ఫోన్ ఛార్జింగ్ సమయంలో వెనుక రన్ అవుతుంటాయి. వీటిని మీరు ఆప్ చేయడం వల్ల మీ ఫోన్ త్వరగా చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది.

మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో మీరు వాడే అడాప్టర్ వల్ల కూడా ఛార్జింగ్ స్లో అయ్యే ప్రమాదం ఉంది. ఏదైనా universal adapter వాడటం వల్ల ఈ షమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి మీరు వీలయినంతగా మీ ఫోన్ కి సంబంధించిన ఒరిజినల్ అడాప్టర్ ని వాడితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

మీ బ్యాటరీ సరైన కండీషన్లో లేకుంటే కూడా ఛార్జింగ్ స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాలం చెల్లిన బ్యాటరీలను పక్కన పడేయడం చాలా మంచిది. ఇప్పుడు కొత్త ఫోన్లను కూడా ప్రధానంగా వేధిస్తున్న సమస్య సరిగా పనిచేయని బ్యాటరీలే. వీటివల్ల ఒక్కోసారి పేలుడు కూడా సంభవించే అవకాశం ఉంది.

ఫోన్ ఛార్జింగ్ సమయంలో అందరూ ఫోన్ వాడుతుంటారు.ఇలా వాడటం వల్ల మీ ఫోన్ అంత త్వరగా చార్జింగ్ ఎక్కదు. కాబట్టి మీరు మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని ముట్టుకోకపోవడమే మంచింది. ఇలా వాడటం వల్ల మీరు మీ ఆరోగ్య సమస్యలను కూడా కొనితెచ్చుకున్నట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆండ్రాయిడ్ ఫోన్లు ఛార్జింగ్ స్లో అయ్యేదానికి ప్రధాన కారణం ఇదే. WiFi/Internet, GPS and Bluetooth అన్ని ఆన్ చేసి ఛార్జింగ్ పెడితే అది చాలా స్లో అవుతుంది. బ్యాటరీ పవర్ ఎక్కువగా కూడా తీసుకుంటుంది. పైన పేర్కొన్న సమస్యలతో పాటు మీ ఫోన్ యూఎస్బి పోర్ట్ సరిగా లేకున్నా కూడా ఛార్జింగ్ స్లో అయ్యే అవకాశం ఉంది.

జన రంజకమైన వార్తలు