సెల్‌ఫోన్లు అనేవి నేటి తరుణంలో మనకు నిత్యావసర వస్తువులుగా మారాయి. అవి లేకుండా ఒక్క క్షణం ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం. ఈ క్రమంలోనే ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్‌ఫోన్లతోనే మనం కాలం గడుపుతున్నాం. కానీ వాటి వల్ల వచ్చే రేడియేషన్ ముప్పును మనం గమనిచడం లేదు. రేడియేషన్ అనేది కంటికి కనిపించే వెలుగు రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని వేడి రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని ఆల్ఫా రేణువులులా ఉండొచ్చు. అయితే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే దాంతో సెల్‌ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ ముప్పును తప్పించుకోవచ్చు. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టిప్ 1
ఫోన్‌ను వీలైనంత వరకు మీ శరీరానికి దూరంగా పెట్టుకోండి.అలాగే ఫోన్ వాడకపోయిన పక్షంలో పక్కన పెట్టేయండి. మీరు ఆఫీస్‌లో పనిచేస్తుంటే డెస్క్‌పై ఫోన్ పెట్టండి. ఫోన్ ఉపయోగం ఉంటేనే దాన్ని తీసుకోండి.
టిప్ 2
చాలా మంది బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ హెడ్‌సెట్లను వాడుతున్నారు. కానీ అవి వాడడం మంచిది కాదు. వాటికి బదులుగా వైర్‌తో ఉన్న హెడ్‌సెట్లను వాడితే సెల్‌ఫోన్ రేడియేషన్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
టిప్ 3
ఫోన్లను ప్రత్యేక పర్సులలో పెట్టుకోండి. జేబుల్లో పెట్టుకోకండి. రాత్రి పూట నిద్రించేటప్పుడు చాలా మంది ఫోన్‌ను తల పక్కనే పెట్టుకుని నిద్రిస్తారు. కానీ అలా చేయరాదు. తలపక్కన ఫోన్ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఎక్కువ రేడియేషన్ విడుదలయి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
టిప్ 4
ఫోన్‌ను చార్జింగ్ పెట్టినప్పుడు వాడకండి. అలాంటి సమయంలో వాటి నుంచి సాధారణ సమయాల్లో కన్నా అధిక రేడియేషన్ విడుదలవుతుంది. కనుక వాటిని చార్జింగ్ తీసి వాడితే మంచిది.
టిప్ 5
మార్కెట్‌లో మనకు సెల్‌ఫోన్‌ల వెనుక భాగంలో వేసే యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు దొరుకుతున్నాయి. వాటిని ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై వేసుకుంటే సెల్‌ఫోన్ రేడియేషన్ ముప్పును కొంత వరకు తగ్గించుకోవచ్చు.
టిప్ 6
చిన్నారులకు సెల్‌ఫోన్లను ఇవ్వకండి. ఇవ్వాల్సి వస్తే సిమ్ తీసేసి ఇస్తే మంచిది. లేదంటే వారిపై రేడియేషన్ మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక గర్భిణీలు సెల్‌ఫోన్లను వీలైనంత తక్కువ వాడితే మంచిది. లేదంటే కడుపులో ఉండే శిశువు ఆరోగ్యంపై అది ప్రభావం చూపుతుంది.