శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ వాడకందారుల కోసం ఇంతకుముందు కొన్ని కిటుకులను వివరించిన నేపథ్యంలో మరిన్నిటిని మీ ముందుకు తెస్తున్నాం.
BUTTONS TO ANSWER OR REJECT CALLS
ఫోన్ కాల్స్ ఆన్సర్, రిజెక్ట్ చేయటానికి ప్రత్యేకించి బటన్స్ లేకపోయినా VOLUME UP, POWER KEYలను ఎనేబుల్ చేసుకుని వాడుకోవచ్చు. ఇదెలాగంటే... SETTINGSలో నుంచి ACCESSBILITYకి, ఆ తర్వాత ANSWERING AND ENDING CALLSలోకి వెళితే అక్కడ ఆన్సరింగ్, రిజెక్టింగ్‌లకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటికి ఎదురుగా కనిపించే బటన్స్‌లో మీకు నచ్చినదాన్ని ఎనేబుల్ చేసుకుంటే సరి!
HIDE MESSAGES AND FILTER CALL LOG
ఫోన్ యాప్ కాల్ హిస్టరీతోపాటు మెసేజ్ హిస్టరీని కూడా చూపించడం మీరు గమనించే ఉంటారు. ఇది మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. దీన్ని హైడ్ చేయడానికో మార్గం ఉంది. ఇందుకోసం ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయండి. కుడివైపు చివర మూడు చుక్కల ఐకాన్‌ను ట్యాప్ చేశాక కనిపించే మెనూలో HIDE MESSAGESని సెలెక్ట్ చేయండి. ఇక ఫోన్ యాప్ కాల్ లాగ్‌లో అన్ని కాల్స్‌నూ చూపుతుంది. కానీ, కొన్నిసార్లు మనం మిస్డ్ లేదా రిజెక్టెడ్ కాల్స్ మాత్రమే చూడాలని భావిస్తాం. ఇందుకోసం ఫోన్ యాప్‌లో కుడివైపు చివర మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్ చేశాక కనిపించే మెనూలో CALLS TO SHOWను సెలెక్ట్ చేసి, తర్వాత ప్రత్యక్షమయ్యే పాప్అప్ మెనూలో తగిన ఫిల్టర్‌ను ట్యాప్ చేయండి.
CLEAR CALL LOG
కాల్ లాగ్‌ను క్లియర్ చేసేందుకు ప్రత్యేకమైన బటన్ ఏమీ లేదు. అయితే, మూడు చుక్కల ఐకాన్‌ను ట్యాప్ చేసినప్పుడు కనిపించే మెనూలో DELETE ఆప్షన్‌ను ఎంచుకోగానే స్క్రీన్ ఎడమవైపు ఎగువన ALL అనే చిన్న ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి, మళ్లీ కుడివైపు కనిపించే DELETEను ప్రెస్ చేయండి.
గమనిక: దీనికి ప్రత్యామ్నాయంగా కాల్ లాగ్‌లో కనిపించే ఏ నంబరుమీదనైనా కాసేపు నొక్కి పట్టుకుంటే మీకు DELETE ఆప్షన్ కనిపిస్తుంది.
SHOW CALLER INFORMATION
కాల్ చేసినప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు వారికి సంబంధించిన కమ్యూనికేషన్ హిస్టరీ కూడా కనిపించాలా? అయితే, ఇలా చేయండి.
STEP 1: ఫోన్ యాప్‌ను ఓపెన్ చేసి, కుడివైపు మూల మూడు చుక్కల ఐకాన్‌ను ప్రెస్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
STEP 2: SHOW CALLER INFORMATIONను సెలెక్ట్ చేయండి.
SHOW CALLS IN POP-UP
ఇతర యాప్స్‌ను వాడుతుండగా మీరు కాల్ కొనసాగిస్తే అది స్క్రీన్ అంతా కనిపిస్తుంది. దీనికిబదులు అది పాప్అప్‌లాగా కనిపిస్తే బాగుంటుంది కదూ! ఇందుకోసం... ఫోన్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి SHOW CALLS IN POP-UPను యాక్టివేట్ చేయండి.
VIBRATE WHEN ANSWERED
మనం ఫోన్ చేయగానే అవతలి వ్యక్తి ఆన్సర్ చేయడాన్ని తెలుసుకునేందుకు ఫోన్‌ను చెవిదగ్గర ఉంచుకోవాలి లేదా స్క్రీన్‌ను చూస్తూండాలి. ఇందుకు బదులు ఆన్సర్ చేయగానే వైబ్రేట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం... సెట్టింగ్స్‌లోకి వెళ్లి, CALL ALERTSపై ట్యాప్‌చేసి, VIBRATE WHEN ANSWEREDను ఎనేబుల్ చేయాలి.
శామ్‌సంగ్‌లో కాలింగ్ ఫీచర్‌ను మరింత అనుకూలం చేసే అనేక సెట్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు వాటిలో చాలా తెలిసినట్టే కదూ!