• తాజా వార్తలు

ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కి చిటిక‌లో క‌నెక్టయ్యే సూప‌ర్ ట్రిక్స్... మీకోసం

ఇది మొబైల్ ఫోన్ల యుగం... ఇప్పుడు చాలా ప‌నులు మొబైల్ లేనిదే న‌డ‌వ‌క‌పోవ‌డంతోపాటు కాలంతో పోటీప‌డుతూ ప‌నులు చేసుకోవాల్సి వ‌స్తోంది. అయితే, మ‌న మొబైల్ నెట్‌వ‌ర్క్‌లో ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు వారినుంచి ప‌రిష్కారం కోరుకుంటాం. కానీ, వినియోగ‌దారుల సంర‌క్ష‌ణ (Customer Care) కేంద్రానికి ఫోన్‌చేస్తే మ‌న‌కు వినిపించే ర‌క‌ర‌కాల ఆప్ష‌న్ల‌తోనే కాలం గ‌డిచిపోతుంది. మ‌నకు మాన‌వ సాయం కావాల్సి ఉన్నా ఆ కేంద్రానికి కాల్స్ పెద్ద సంఖ్య‌లో వ‌స్తాయిగ‌నుక‌ నేరుగా వారితో మాట్లాడే అవ‌కాశం కోసం చాలాసేపు ఎదురుచూడాల్సి వ‌స్తుంది. ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిన‌పుడు ‘ఎయిర్‌టెల్‌’ క‌స్ట‌మ‌ర్ కేర్ సెంట‌ర్‌లో స‌హాయ‌కుల‌తో త్వ‌ర‌గా క‌నెక్ట్ కావ‌డానికి ఇవిగో చిట్కాలు:-
TRICK -1
1.    మొద‌ట టోల్‌ఫ్రీ నంబ‌రు 198 లేదా 121కి డ‌య‌ల్ చేయండి (121కి డ‌య‌ల్ చేసిన‌ట్ల‌యితే 3 నిమిషాల‌కు 50 పైస‌ల వంతున చెల్లించాల్సి ఉంటుంది).
2.    త‌ర్వాత IVRద్వారా వినిపించే సూచ‌న‌ల‌ను వింటూ మొబైల్ సేవ‌ల కోసం ‘‘1’’ నొక్కండి.
3.    ఇప్పుడు లేటెస్ట్ ఆఫ‌ర్ల గురించి ఓ అమ్మాయి గొంతు వివ‌రిస్తుంది. అప్పుడు ఇత‌ర సేవ‌ల ఆప్ష‌న్ వినిపించ‌గానే ‘‘2’’ నొక్కండి.
4.    మ‌ళ్లీ అదే గొంతు- మీ మెయిన్ బ్యాల‌న్స్, ఎక్స్‌పైరీ డేట్‌ల‌ను వివ‌రిస్తుంది. అప్పుడు మ‌ళ్లీ ఇత‌ర సేవ‌ల కోసం ‘‘2’’ నొక్కండి.
5.    ఇప్పుడు వినిపించే ఇత‌ర ఆప్ష‌న్లను ప‌ట్టించుకోకుండా డేటా స‌ర్వీసెస్ కోసం ‘‘5’’ నొక్కండి.
6.    ఆ త‌ర్వాత ‘‘9’’ నొక్కారంటే మీ కాల్ వెంట‌నే క‌స్ట‌మ‌ర్ కేర్ కేంద్రం స‌హాయ‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది.

ఈ విధంగా చేస్తే కేవ‌లం ఒక్క నిమిషంలోపే మ‌న స‌మ‌స్య ఏమిటో నేరుగా చెప్పి స‌హాయం పొంద‌డం సాధ్య‌మ‌వుతుంది. అంటే... స‌మ‌య‌స్ఫూర్తితో ‘‘1, 2, 2, 5, 9’’ నంబ‌ర్ల‌ను ఒక‌దానివెంట మ‌రొక‌టిగా నొక్కాలన్న మాట!

TRICK -2
1.    ముందుగా 198కి కాల్ చేయండి.
2.    ఆప్ష‌న్లు వినిపించే స‌మ‌యంలో స‌మ‌య‌స్ఫూర్తితో ‘‘1, 2, 4, 9’’ నంబ‌ర్ల‌ను ఒక‌దానివెంట మ‌రొక‌టిగా నొక్కండి.
ఎయిర్‌టెల్ ‘క‌స్ట‌మ‌ర్ కేర్ డైరెక్ట్ కాలింగ్’ నంబ‌ర్లు
•    ప్రీపెయిడ్ స‌ర్వీసుల కోసం 98960 98960
•    పోస్ట్‌పెయిడ్ స‌ర్వీసుల కోసం 98960 12345
మీరు ఏదైనా ఇతర మొబైల్ నెట్‌వ‌ర్క్‌లో ఉండి, ‘‘ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కేర్‌’’కు ఫోన్‌ చేయాల్సి వ‌స్తే- పైన పేర్కొన్న ట్రిక్స్‌తో మీకు ఉప‌యోగం ఉండ‌దు. అందువ‌ల్ల మీరు 98960 98960 నంబ‌రుకు కాల్ చేయాల్సిందే.

జన రంజకమైన వార్తలు