• తాజా వార్తలు

కంప్యూట‌ర్ హీట్ ఎక్కిన‌ప్పుడు ఆటో షట్ డౌన్ సెట్ చేయ‌డం ఎలా?

ఫోన్ మాత్ర‌మే కాదు బాగా ఉప‌యోగించిన‌ప్పుడు కంప్యూట‌ర్ కూడా వేడెక్కిపోతుంది. ఇలా కంప్యూట‌ర్ వేడెక్కిన త‌ర్వాత కూడా మ‌నం వాడ‌డం ఆప‌క‌పోతే దీని ఫెర్మార్‌మెన్స్ మీద ప్ర‌భావం ప‌డుతుంది. ఇలాంట‌ప్పుడు మ‌నం ఏం చేయాలి.  మ‌న కంప్యూట‌ర్ వేడెక్కిన‌ప్పుడు ముందుగానే ఆటో ష‌ట్ డౌన్ చేసుకోవ‌చ్చు. మ‌రి ఎలా సెట్ చేసుకోవ‌చ్చో తెలుసా?

కోర్ టెంప్
మీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ వేడెక్క‌కుండా ఉండ‌డం కోసం ఒక టూల్ వ‌చ్చింది.. దాని పేరే కోర్ టెంప్‌. మీ పీసీని వేడెక్క‌నీయ‌కుండా చేయ‌డంలో ఇది కీల‌క‌పాత్ర పోషిస్తుంది. మీ సీపీయూ టెంప‌రేచ‌ర్‌ని ఈ టూల్ మానిట‌ర్ చేస్తుంది. మీ హార్డ్‌వేర్‌ని బ‌ట్టి మీరు క్రిటిక‌ల్ టెంప‌రేచ‌ర్ షెడ్యుల్‌ని ప్లాన్ చేసుకోవ‌చ్చు. అక‌స్మాత్తుగా జ‌రిగే ష‌ట్ డౌన్స్‌, హార్డ్‌వేర్ డ్యామేజ్‌ల నుంచి ఇది కాపాడుతుంది. మీ కంప్యూట‌ర్ ష‌ట్ డౌన్ అయినా హైబ‌ర్‌నెట్ లేదా స్లీప్ మోడ్‌లోకి వెళ్లినా మీకు ఎలాంటి డేటా లాస్ ఉండ‌దు. 

షెడ్యుల్ ఆటో ష‌ట్‌డౌన్‌
మ‌న డేటా లాస్ కాకుండా ఉండాలంటే... మ‌న కంప్యూట‌ర్‌కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండాలంటే షెడ్యుల్ ఆటో ష‌ట్‌డౌన్ బాగా యూజ్ అవుతుంది. ఇందుకోసం కోర్ టెంప్ టూల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితం. ఈ టూల్ మీ సీపీయూని ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేస్తూ టెంప‌రేచ‌ర్‌ని త‌గ్గిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఎక్స్‌క్యూటివ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత పీసీలో స్టెప్స్ ఆధారంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.  ఒక‌సారి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసిన త‌ర్వాత మీ సిస్ట‌మ్ ట్రేలోని ప్ర‌తి కోర్ టెంప‌రేచ‌ర్‌ని ఇది ప‌ర్య‌వేక్షిస్తుంది. ఇంట‌ర్‌ఫేస్‌ని ఉప‌యోగిస్తే మీ సీపీయూ స్పెసిఫికేష‌న్లు చూపిస్తుంది. మ‌ల్టీ ప్రాసెస‌ర్ క‌న్ఫిగ‌రేష‌న్‌కి కూడా ఇది స‌పోర్ట్ చేస్తుంది. 

ఇలా చేయాలి
షెడ్యుల్ ఆటో ష‌ట్‌డౌన్ లేదా హైబ‌ర్‌నేట్‌, లేదా స్లీప్ మోడ్ కోసం కొన్ని ఆప్ష‌న్ల మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కోర్ టెంప్ టూల్‌లోని ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత ఓవ‌ర్ హీట్ ప్రొటెక్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత క్రిటిక‌ల్ టెంప‌రేచ‌ర్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత మీరు ష‌ట్ డౌన్ షెడ్యుల్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు