• తాజా వార్తలు

ప‌దే ప‌దే పాస్‌వ‌ర్డ్ సేవ్ చేయ‌నా అని విసిగిస్తున్నాయా?  ఈ ట్రిక్ మీకోస‌మే..

 ఫైర్‌ఫాక్స్ బ్రౌజ‌ర్‌లో ఏదైనా వెబ్ సైట్‌లోకి లాగిన్ కాగానే మీ పాస్‌వ‌ర్డ్ సేవ్ చేయ‌మంటారా అని పాప్ అప్ లేదా పాస్‌వ‌ర్డ్ సేవింగ్ ప్రాంప్ట్స్ విసిగిస్తుంటాయి. దీన్ని మీరు ఫైర్‌ఫాక్స్ ప్రైవ‌సీ అండ్ సెక్యూరిటీ పేజీలోకి వెళ్లి ఆ పేజీ నుంచి డిజేబుల్ చేయొచ్చు. కానీ దాన్ని మ‌ళ్లీ ఎవ‌రైనా ట‌ర్న్ ఆన్ చేస్తే మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌తంగా చెక్ పెట్టాలంటే ఫైర్‌ఫాక్స్ కోసం వ‌చ్చిన విండోస్ గ్రూప్ పాల‌సీ (Windows GPO) ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  పాస్‌వ‌ర్డ్ సేవింగ్ ప్రాంప్ట్‌ను శాశ్వ‌తంగా డిజేబుల్ చేస్తుంది. 

ఎలా చేయాలంటే?

1. ఫైర్‌ఫాక్స్ బ్రౌజ‌ర్‌కి గ్రూప్ పాల‌సీ స‌పోర్ట్‌ను యాడ్ చేయండి. 

2. ఇప్పుడు  Windows GPOను మీ పీసీలో స్టార్ట్ చేయండి. మీరు విండోస్ Pro లేదా  enterprise వెర్ష‌న్ వాడుతుంటే గ్రూప్ పాల‌సీ మీకు ఆల్రెడీ ఉంటుంది.  విండోస్ హోం వెర్ష‌న్ వాడుతున్న‌ట్ల‌యితే గ్రూప్ పాల‌సీని యాడ్ చేయ‌డానికి విండోస్ యొక్క ర‌న్ /  సెర్చ్ బాక్స్‌లో gpedit.msc అని టైప్ చేస్తే గ్రూప్ పాలసీ ఓపెన్ అవుతుంది.

3.  మీ Computer Configurationలోకి వెళ్లి  దానిలో Administrative Templates కింద ఉన్న Mozilla folderను టాప్ చేయండి. దానిలో Firefox ఫోల్డ‌ర్‌ను సెలెక్ట్ చేయండి. 

4.ఫైర్‌ఫాక్స్ ఫోల్డ‌ర్‌లోని ఆప్ష‌న్ల‌లో  offer to save logins settingని డ‌బుల్ క్లిక్ చేయండి.

5. Offer to save logins పేరిట ఓ విండో ఓపెన్ అవుతుంది. ఇది Disabled ఆప్ష‌న్‌తో వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేసిApply,  త‌ర్వాత OK బ‌ట‌న్ క్లిక్ చేయాలి.

అంతే  మీ ఫైర్‌ఫాక్స్ బ్రౌజ‌ర్‌లో ఇక మీరు ఎలాంటి వెబ్‌సైట్ లోకి లాగిన్ అయినా పాస్‌వ‌ర్డ్ ప్రాంప్ట్, పాప్ అప్ విండోగానీ రానే రాదు

తిరిగి తెచ్చుకోవాలంటే 
ఒక‌వేళ మీరు ఫైర్‌ఫాక్స్‌లో పాస్‌వ‌ర్డ్ సేవింగ్ ప్రాంప్ట్ తిరిగి రావాల‌నుకుంటే మ‌ళ్లీ ఈ స్టెప్స్ అన్నీ చేసుకుంటూ రావాలి. అయితే 5వ స్టెప్‌లో మాత్రం Not Configured option క్లిక్ చేసి సేవ్ చేస్తే చాలు.

 
 

జన రంజకమైన వార్తలు