వాట్సప్ వాడందే మనకు తెల్లారదు.. పొద్దున్నే లేవగానే సుప్రభాతం వింటామో లేదో తెలియదు కానీ వాట్సప్‌లో మెసేజ్‌లు మాత్రం చూసుకుంటాం... అంతగా అడిక్ట్ అయిపోయాం ఈ మెసేజింగ్ యాప్‌కి. అయితే వాట్సప్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టం కూడా ఉంది. ముఖ్యంగా గ్రూపుల వల్ల మనం చాలాసార్లు చిక్కుల్లో పడిపోతుంటాం. నిజానికి మనకు తెలియకుండానే మనం ఇందులో ఇరుక్కుంటాం. స్పామ్ నోటిఫికేషన్లను క్లిక్ చేయడం వల్లే ఈ ఇబ్బందులన్నీ! మరి వాట్సప్ స్పామ్ గ్రూపుల నుంచి వచ్చే నోటిఫికేషన్లను ఆపడం ఎలా?
వాట్సప్‌లో మనం గ్రూపులు పెట్టుకోవడం ఏమి నష్టం కాదు.. కానీ వాటిని తెలివిగా పెట్టుకోవడం లేదా జాయిన్ కావడం ముఖ్యం. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం పర్మిషన్లు ఇచ్చేస్తాం. మనకు తెలియకుండానే మన డేటాను అప్పగిస్తాం. అందుకే ప్రతి లింక్‌ను క్లిక్ చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతాం. అందుకోసం వాట్సప్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. స్పామ్ గ్రూప్ ఇన్వైట్‌లను ప్రివెంట్ చేయడానికి ఈ సెట్టింగ్స్ ఉపయోగపడతాయి. మీకు ఏ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలో వాట్సప్ మనకు కొన్ని ఛాయిస్‌లు ఇస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని జాయిన్ కావొచ్చు. ఇందుకు ఏం చేయాలంటే..
1. వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
2. అకౌంట్స్ క్లిక్ చేయాలి.. ఆ తర్వాత ప్రైవసీలోకి వెళ్లి నెక్ట్ గ్రూప్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి
3. అందులో మూడు ఆప్షన్లు ఉంటాయి.. నోబడీ, మై కాంటాక్ట్స్, ఎవ్రీ వన్ అనే ఆ మూడు ఆప్షన్లలో ఏదొకటి ఎంచుకోవాలి. నోబడీ అనే ఆప్షన్ ఎంచుకుంటే మీరు ఏ గ్రూప్‌లోకి వెళ్లలేరు. మీకు ఎవరూ ఎలాంటి స్పామ్ మెసేజ్‌లు పంపలేరు.
4. మై కాంటాక్ట్స్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మీ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లు తప్ప అన్ నోన్ సోర్సెస్ నుంచి మీకు ఎలాంటి స్పామ్ రిక్వెస్ట్‌లు రావు.