• తాజా వార్తలు

రిమోట్‌గా ఉన్న పీసీ ద్వారా అజ్ఞాత‌వాసిలా ఇంట‌ర్నెట్ యాక్సెస్ చేయ‌డానికి ట్రిక్‌

మీ ఇంట్లోనో,ఆఫీస్‌లోనో ఉన్న పీసీకి ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉంది. దాన్ని బ‌య‌ట ఎక్క‌డి నుంచి అయినా మీరుగానీ, మీ ఫ్రెండ్స్‌గానీ రిమోట్ ప‌ద్ధ‌తిలో వాళ్ల పీసీకి కూడా వాడుకోవ‌చ్చు. వైర్‌లెండ్స్ (Wirelends) అనే టూల్ ద్వారా ఇలా మీ పీసీకి నెట్ క‌నెక్ష‌న్‌ను వేరే పీసీకి కూడా వాడుకోవ‌చ్చు.  వైర్‌లెండ్స్ ద్వారా రిమోట్ ప‌ద్ధ‌తిలో ఇంట‌ర్నెట్ వాడుకోవడం ఎలాగో చూడండి. 

రెండు పీసీల్లోనూ ఇన్‌స్టాల్ చేయాలి
వైర్‌లెండ్స్ మీ పీసీలోనూ, ఫ్రెండ్ లేదా ఇత‌ర పీసీలో కూడా ఇన్‌స్టాల్ చేసిన‌ప్పుడే ఇది వ‌ర్క‌వుట్ అవుతుంది.  అంతేకాదు ఆ డివైస్‌లోని నెట్ క‌నెక్ష‌న్ యాక్టివ్‌గా ఉండాలి. పీసీ, మ్యాక్‌, స్మార్ట్ ఫోన్ దేనితోనైనా ఇది ప‌ని చేస్తుంది. సింపుల్ యూసేజ్‌కి అయితే వైర్‌లెండ్ టూల్ ఫ్రీ వెర్ష‌న్ స‌రిపోతుంది. ఎందుకంటే ఇందులో కొన్ని ప‌రిమితులు ఉంటాయి. ఫీచ‌ర్లు త‌క్కువ ఉంటాయి. ఎక్కువ ఫీచ‌ర్లు, ఎక్కువ పీసీ రిలే కావాలంటే ప్రీమియం వెర్ష‌న్‌కు అప్‌గ్రేడ్ కావాలి.

 ఎలా ప‌నిచేస్తుంది?
1. వైర్‌లెండ్స్ టూల్‌ను మీ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోండి.  ఓపెన్ చేస్తే ఇంట‌ర్‌ఫేస్ క‌నిపిస్తుంది. ఇన్‌స్టాలేష‌న్ జ‌రుగుతున్న‌ప్పుడే వైర్‌లెండ్స్ మీ పీసీలో ఓ వ‌ర్చువ‌ల్ నెట్‌వ‌ర్క్ డివైస్‌ను కూడా ఇన్‌స్టాల్ చేస్తుంది. దాన్ని కూడా ఇన్‌స్టాల్ చేయాలి.

2. ఇప్పుడు మీ  ఫ్రెండ్‌ను అత‌ని వైర్‌లెండ్స్ ఐడీ పాస్‌వ‌ర్డ్ చెప్ప‌మ‌ని అడ‌గండి. వాటిని మీ పీసీలో ఉన్న వైర్ లెండ్ ఇంట‌ర్ ఫేస్‌లో ఎంట‌ర్ చేసి క‌నెక్ట్ నౌ బ‌ట‌న్ నొక్కండి.

3. కొన్ని సెకన్లలోనే అది క‌నెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు మీ ఫ్రెండ్ పీసీలో ఉన్న ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్‌ను రిమోట్ మెథ‌డ్ ద్వారా వాడుకుని మీ పీసీలో బ్రౌజ్‌చేసుకోవ‌చ్చు.

4. ఎప్పుడు కావాలంటే అప్పుడు డిస్‌క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.  మ‌ళ్లీ అవ‌స‌ర‌మైతే ఐడీ, పాస్‌వ‌ర్డ్‌తో క‌నెక్ట్ అవ్వ‌చ్చు.

5.ఇది మీ సిస్టం ఐపీని కూడా మార్చి చూపిస్తుంది.

6. ప్ర‌పంచంలో ఏ మూల ఉన్న వ్య‌క్తితో అయినా ఈ రిమోట్ పీసీ మెథ‌డ్ ద్వారా ఒక వ‌ర్చువ‌ల్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ (వీపీఎన్‌) క్రియేట్ చేసుకోవ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు