తెలియని ప్రదేశానికి వెళితే ఒకప్పుడు వాళ్లను వీళ్లనూ అడిగి నానా ప్రయాస పడేవాళ్లం.ఇప్పుడు ఆ బాధ లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటేచాలు.గూగుల్ మ్యాప్స్ మనకు మార్గదర్శిగా పనిచేస్తున్నాయి. అయితే దీంతో వచ్చిన చిక్కల్లా బ్యాటరీ తొందరగా అయిపోవడమే. దానికీ చాలా పరిష్కారాలున్నాయి.దీనికోసం మీరేమీ కొత్తగా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. జస్ట్ మీ ఫోన్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులుచేసుకుంటే చాలు. అలాంటి టిప్స్ మీకోసం..
జీపీఎస్ ఆఫ్ చేయండి
జీపీఎస్ మీ ఫోన్ బ్యాటరీని భారీగా వాడేస్తుంది. దీన్నినివారించాలంటే జీపీఎస్ యాక్సెస్ ఉన్నయాప్స్‌లో జీపీఎస్ యాక్సెస్‌ను రెస్ట్రిక్ట్ చేయాలి.
బ్యాటరీ సేవింగ్ మోడ్‌ను స్విచ్ ఆన్ చేయండి
మీ ఫోన్ సెట్టింగ్స్‌లో లొకేషన్ మోడ్‌లోకి వెళితే High accuracy, Battery saving, Device only అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.ఇందులో మొదటి ఆప్షన్ జీపీఎస్, వైఫై, బ్లూటూత్ లేదా లేదా మొబైల్ నెట్‌వర్క్‌ను యూజ్‌చేసుకుని మీకు అత్యంత కచ్చితమైనలొకేషన్‌ను చూపిస్తుంది.అయితే ఈ ప్రక్రియలో బ్యాటరీ బాగా ఖర్చవుతుంది.ఇక రెండో ఆప్షన్ అయిన బ్యాటరీ సేవింగ్‌ను మీరు స్విచ్ ఆన్ చేసుకుంటే అది జీపీఎస్‌ను ఆఫ్ చేసి వైఫై, బ్లూటూత్ లేదా మొబైల్ నెట్‌వర్క్ ద్వారా మీకు కావాల్సిన లొకేషన్‌ను చూపిస్తుంది. ఈ ఆప్షన్‌ను యూజ్ చేసుకుంటే మీరు గూగుల్ మ్యాప్స్ వాడుకున్నా బ్యాటరీ పెద్దగా ఖర్చవదు.
క్యాచీ లేదా డేటాను క్లియర్ చేయండి
గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్ అవుతున్నప్పుడు ఆ యాప్‌లోకి వెళ్లి మీ పాత డేటాను క్లియర్ చేయండి. లేకపోతే యాప్ క్యాచీ మీ పాత లొకేషన్ డేటాను కూడా లోడ్ చేసుకుంటుంది. దీనికోసం ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తుంది. ఇదంతా బ్యాటరీని తినేస్తుంది.అందుకే ఎప్పటికప్పుడు యాప్ క్యాచీని క్లియర్ చేస్తే మీ బ్యాటరీ వాడకం తగ్గుతుంది. క్యాచీని క్లియర్‌చేయడానికి Settings>Appsలోకి వెళ్లి App managerని క్లిక్ చేయండి. గూగుల్ మ్యాప్స్‌ను సెర్చ్‌చేసి ఆ యాప్‌ను ఓపెన్ చేయండి.అక్కడ మీకు Clear cache and data ఆప్షన్ కనిపిస్తుంది. దాన్నిక్లిక్‌చేస్తే మీ క్యాచీ పాత డేటా కూడా క్లియర్ అయిపోతాయి..
పాత వెర్షన్‌కు వెళ్లిపోండి
తరచుగా అప్‌డేట్స్ వస్తుంటే యాప్ సైజ్ కూడా పెరిగిపోతుంది. దీనివల్ల కొత్త ఫీచర్లు వచ్చినా కూడా బ్యాటరీ భారీగా ఖర్చయిపోతుంది.అందుకే గూగుల్ మ్యాప్స్‌యాప్ పాత వెర్షన్‌కు వెళ్లిపోండి. ఇలా యాప్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే మీ బ్యాటరీ యూసేజ్ బాగా తగ్గుతుంది. గూగుల్ మ్యాప్స్‌యాప్‌ను డౌన్‌గ్రేడ్‌చేసి పాత వెర్షన్‌కువెళ్లాంటే ఫోన్‌లో Settings ఓపెన్‌చేసి Menu>Appsలోకి వెళ్లి Google Mapsను సెర్చ్‌చేయండి.ఇప్పుడు టాప్‌లో కుడివైపున్న త్రీడాట్స్‌ను టాప్‌చేస్తే అన్ ఇన్‌స్టాల్డ్ అప్‌డేట్స్‌నుచూపిస్తుంది. దాన్నిటాప్‌చేస్తే మీ యాప్ పాత వెర్షన్‌కు వెళ్లిపోతుంది.