• తాజా వార్తలు

ఇయర్ ఫోన్స్ లేకుండా వాట్సాప్ ఆడియో మెసేజ్ లు వినడం ఎలా?

ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడనివారంటూ ఉండరు...మెసేజ్ లు, ఫోటోలు పంపించుకోవడం, వాయిస్ మెసేజ్ పంపించడం ఇలాంటివి వాట్సాప్ ద్వారా ప్రతిరోజూ చేస్తూనే ఉంటాయి. కానీ వాయిస్ మెసేజ్ లు పంపించుకునే వారికి ఒక సమస్య ఉంది. ఏదైనా మీటింగ్ లోకానీ...ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన వారు పంపించిన వాయిస్ మెసేజ్ వినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అది సీక్రెట్ మెసేజ్ అయితే పక్కనవాళ్లు వినే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఉన్నట్లు చాలా వరకు ఎవరికీ తెలియదు. ఇయర్ ఫోన్స్ లేకుండా వాట్సాప్ ఆడియో మెసేజ్ ఎలా వినాలో తెలుసుకుందాం. 

మీ ఫోన్ తీసుకుని...మీ చెవి దగ్గర పెట్టుకుని వాట్సాప్ ఆడియో ఫైల్స్ పై ప్లే బటన్ నొక్కండి. ఇప్పుడు మీ చెవుల దగ్గరే  ఇయర్ ఫోన్స్ కానీ, స్పీకర్స్ కానీ లేకుండా ఆడియో ఫైల్ ప్లే అవుతుంది. అంతేకాదు వాట్సాప్ ఆడియో ఫైళ్లను సరదాగా వాకీ టాకీ ఫీచర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతో మీ పర్సనల్ ఆడియోను ఎవరూ వినలేరు. అయితే ఈ ఫీచర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 

ఈమధ్యే వాట్సాప్ కమ్యూనికేట్ చేయడానికి ఒక ఫీచర్ను డెవలప్ చేశారు. ఆడియో ఫైళ్లను ఈజీగా....మెసేజ్ రికార్డు చేయడానికి మైక్ బటన్ ఉండాల్సిన పనిలేదు. మీరు రికార్డింగ్ బటన్ పై నొక్కండి. స్క్రీన్ పై లాక్ ఐకాన్ నొక్కినట్లయితే...రికార్డు అయ్యేది మీరు గమనిస్తారు. 
 

జన రంజకమైన వార్తలు