• తాజా వార్తలు

ఫోన్ పోయినా వాట్సాప్ చాట్ సేఫ్ గా ఉంచడానికి టిప్స్

ఫోన్ పోయిందంటే ఎన్నో రకాలు టెన్షన్లు పడుతుంటాం. అందులో ఉండే నెంబర్లు, మొబైల్ బ్యాంకింగ్, ఇ మెయిల్స్, వాట్సాప్ చాట్ ఇలా ఎన్నో రకాల సర్వీసుల గురించి అవతలి వారికి తెలిసిపోతుందన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వాట్సాప్ చాట్. అందులో ఉన్న సమాచారం భద్రంగా ఉందా లేదా అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మరి...ఫోన్ పోయినా వాట్సాప్ చాట్ సేఫ్ గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. 

1. సిమ్ కార్డ్ లాక్ చేయించడం...
ఫోన్ పోయిందని తెలిసిన వెంటనే... సర్వీసు ప్రొవైడర్ కు ఫోన్ చేసి సిమ్ కార్డును లాక్ చేయించాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్ లోని వాట్సాప్ అటోమెటిగ్గా డిజేబుల్ అవుతుంది. ఒకవేళ వాట్సాప్ యాక్టివేట్ చేయాలంటే మరో నెంబర్ కు మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయాల్సి ఉంటుంది. 
2. అదే నెంబర్ తో కొత్త సిమ్ కార్డును తీసుకున్నాక...ఆ సిమ్ కార్డుతో వాట్సాప్ ను యాక్టివేట్ చేయవచ్చు. 
3. ఒక్క ఫోన్ నెంబర్ తో ఒక్క డివైజుతోనే వాట్సాప్ యాక్టివేట్ అవుతుందన్న విషయం గుర్తుంచుకోండి. 
4. ఒకవేళ సిమ్ కార్డు యాక్టివేట్ ప్రక్రియలో ఆలస్యమైనట్లయితే...వాట్సాప్ కస్టమర్ కేర్ కు ఈమెయిల్ పంపించవచ్చు. నా ఫోన్ పోయింది...అకౌంట్ ను డీయాక్టివేట్ చేయండి అని మెసేజ్ చేస్తే చాలు. ఈ మెయిల్ లో మన ఇండియా కోడ్ తోపాటు ఫోన్ నెంబర్ కూడా పంపించాల్సి ఉంటుంది. 
5. మీ వాట్సాప్ చాట్ బ్యాక్ అప్ మెసేజ్ లు గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్, వన్ డ్రైవ్ లో గానీ సేవ్ చేసుకోని ఉన్నట్లయితే....బ్యాక్ అప్ వస్తుంది. 

ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి....
1. వాట్సాప్ అకౌంట్ డియాక్టివేట్ అయినా కూడా మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ నుంచి మెసేజ్ లు వస్తుంటాయి. నెలరోజుల పాటు ఆ మెసేజ్ లు పెండింగ్ లోనే ఉంటాయి. 

2. డిలీట్ చేసిన అకౌంట్ ను రియాక్టివేట్ చేసే ముందు..పెండింగ్ లో ఉన్న మెసేజ్ లు, గ్రూప్ చాట్స్ మీ కొత్త ఫోన్లోకి వస్తాయి. 
3. 30రోజుల్లో అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోనట్లయితే....శాశ్వతంగా అకౌంట్ డిలీట్ అవుతుంది. 
4. ఒకవేళ సిమ్ కార్డు లాక్ అయినా...ఫోన్ సర్వీస్ డిజాబుల్డ్ అయినా...వైఫై ద్వారా వాట్సాప్ అకౌంట్ ను డియాక్టివేట్ చేయమని రిక్వెస్ట్ పెట్టవచ్చు. 
5. మీ ఫోన్ ఎక్కడ పోయిందన్న లొకేషన్ను వాట్సాప్ గుర్తించదు. 
 

జన రంజకమైన వార్తలు