ఓకే గూగుల్.. గూయిల్ వాయిస్ అసిస్టెంట్‌లో ఉన్న ఈ కమాండ్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికీ బాగా అలవాటయిపోయింది. గూగుల్‌లో ఏది సెర్చ్ చేయాలన్నా అందరూ ఓకే గూగుల్ అంటున్నారు. అయితే ఈ ఫీచర్ పనిచేయకపోతే ఏం చేయాలో తెలుసుకుంటే ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా ఈజీగా ట్రబుల్ షూట్ చేయొచ్చు.
1. ఓకే గూగుల్ వాయిస్ కమాండ్‌ను ఎనేబుల్ చేయండి
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ అనేబుల్ కాలేదేమో చెక్ చేయండి. ఒకవేళ ఇది అనేబుల్ అయి ఉన్నా వాయిస్ కమాండ్ ఫీచర్ డిజేబుల్‌గా ఉందేమో చూసుకోండి. ఫోన్‌లో హోం బటన్ క్లిక్ చేయగానే గూగుల్ అసిస్టెంట్ ‘Hi, how can I help? అని అడుగుతుంది. అలా లేకపోతే మీ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ అనేబుల్ చేయాలి.
* ఇందుకోసం మీ ఫోన్‌లో గూగుల్ యాప్ లాంచ్ చేయండి. త్రీ లైన్స్‌లో ఉన్న హాంబర్గర్ లాంటి ఐకాన్‌ను క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
* టాప్‌లో మీకు Google Assistant అని కనిపిస్తుంది. దానిలో సెట్టింగ్స్‌ను క్లిక్ చేయండి.
* సెట్టింగ్స్‌లో ఫోన్‌ను క్లిక్ చేసి గూగుల్ అసిస్టెంట్ అనేబుల్ అయి ఉందో లేదో చూడండి. డిజేబుల్‌గా ఉంటే ఆ బటన్‌ను టూగుల్ చేసి అనేబుల్ చేయాలి.
* తర్వాత దాని కింద ఉన్న Access with Voice Match ఆప్షన్‌ను అనేబుల్ చేయండి. దాన్ని క్లిక్‌చేసిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ మీ వాయిస్ మోడల్‌ను క్రియేట్ చేసి పనిచేస్తుంది.
2. లాంగ్వేజ్ అడ్డంకులు తొలగించండి
గూగుల్ అసిస్టెంట్‌లో డిఫాల్ట్‌గా అమెరికన్ (యూఎస్) ఇంగ్లీష్ ఉంటుంది. దీన్ని మీ లాంగ్వేజ్‌లోకి మార్చుకోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి Search Language మీద క్లిక్ చేయండి.
* దీనిలో మీ ఫ్రిఫరెన్స్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని దానిమీద బ్లూ టిక్ చేయండి.
* దాని కింద వాయిస్ ఆప్షన్‌లోకి వెళ్లి Offline speech recognitionను క్లిక్ చేయండి.
* అంతేకాదు మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఇలా చేస్తే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా వాయిస్ అసిస్టెంట్‌ను వాడుకోవచ్చు.
అయితే గూగుల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌నే బాగా అర్ధం చేసుకోగలదు. ప్రాంతీయ భాషలతో ప్రాబ్లం కాబట్టి ఇంగ్లీష్‌నే వాడడం మంచిది.
3. మైక్రోఫోన్ పనిచేస్తుందో లేదో చెక్ చేయండి
ఓకే గూగుల్ కమాండ్ పనిచేయాలంటే మీ ఫోన్‌లోని మైక్రోఫోన్ బాగా పనిచేయాలి. మీ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ దగ్గర చిన్నగా కనిపించే రంధ్రమే మైక్రోఫోన్. మీరు గూగుల్ యాప్ ఓపెన్ చేయగానే సెర్చ్‌బార్ పక్కన కనిపించే బ్లూ కలర్ మైక్రోఫోన్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసి ఏదైనా వాయిస్ కమాండ్ ఇవ్వండి. ఫోన్ దాన్ని తీసుకుంటే మీ మైక్రోఫోన్ బాగా పనిచేస్తున్నట్లు లేకపోతే చిన్న పిన్‌తో స్మూత్‌గా మైక్రోఫోన్ దగ్గర క్లీన్ చేస్తే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. అప్పటికీ పనిచేయకపోతే సర్వీస్ సెంటర్‌లో చూపించండి.
4 శాంసంగ్ బిక్స్ బీ యూజర్లా?
శాంసంగ్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా బిక్స్‌బీ అనే వాయిస్ అసిస్టెంట్ ఉంది. అది యాక్టివ్‌గా ఉంటే ఆ ఫోన్‌లో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ పనిచేయదు. అందుకే S Voice యాప్‌ను లాంగ్ ప్రెస్ చేసి వదిలితే ఓ పాప్ అప్ ఓపెన్ అవుతుంది. disable ఆప్షన్ క్లిక్ చేస్తే శాంసంగ్ బిక్స్‌బీ డిజేబుల్ అయి అప్పుడు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ పని చేస్తుంది.
5. ఈ ట్రిక్స్ పని చేస్తాయి
* ఫోన్‌ను రీ బూట్ చేసి చూడండి. ఒక్కోసారి వర్కవుట్ అవ్వచ్చు.
* గూగుల్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి.
* బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న యాప్స్ అన్నీఆపేసి అప్పుడు గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేసి ట్రై చేయండి.
6. గూగుల్ అసిస్టెంట్‌ను మళ్లీ మొదటి నుంచి వాడండి
సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్ అసిస్టెంట్ క్లిక్ చేసి Google Assistant Voice Match Train చేసి మళ్లీ మీ వాయిస్‌నుగుర్తించడం నేర్పండి.