శాంసంగ్ గెలాక్సీ.. మొబైల్ ప్రియులకు అత్యంత ఇష్టమైన మోడల్స్‌లో ఒకటి. ముఖ్యంగా సంప్రదాయ వాదులు శాంసంగ్ ఫోన్‌ను వాడటానికే ఇష్టపడతారు. ఎన్ని కొత్త కొత్త ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా శాంసంగ్ విలువ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే కారణం ఆ కంపెనీపై వినియోగదారులకు ఉన్న నమ్మకమే. అయితే చాలామంది శాంసంగ్ ఫోన్‌ను వాడతారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోరు. తాజాగా గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ వెర్షన్లలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే మరింత ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. మరి గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌ను మరింత సమర్థంగా ఉపయోగించుకోవడానికి కొన్ని ట్రిక్స్ మరియు టిప్స్ ఉన్నాయి అవేంటో చూద్దామా..
నేవిగేటర్ బటన్ స్వాపింగ్
శాంసంగ్ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లలో నేవిగేటర్ బటన్స్‌ను స్వాప్ చేసుకుని మనకు కంఫర్ట్ట్‌బుల్‌గా వాడుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో బ్యాక్ బటన్ కుడి చేతి వైపు ఉంటుంది. మీరు ఉపయోగించేటప్పుడు ఇది ఇబ్బందిగా అనిపిస్తే మార్చుకొవచ్చు. ఇలా చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి నేవిగేషన్ బార్ మీద క్లిక్ చేయాలి. అందులో మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎంపిక చేసుకోవాలి. అంతేకాక సెంసిటివిటిని కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వాపింగ్ బటన్ క్లిక్ చేస్తే నేవిగేషన్ ఫంక్షనింగ్ మారే అవకాశం ఉంది.
డౌన్‌లోడ్ వేగం పెంచుకోవచ్చు
సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత డౌన్‌లోడింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. కానీ శాంసంగ్ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లలో కొన్ని ట్రిక్‌ల ద్వారా డేటా డౌన్‌లోడింగ్ స్పీడ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. వైపై, డేటా ఈ రెండు డౌన్‌లోడ్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. కనెక్టన్ష్ ఆప్షన్లోకి వెళ్లి మోర్ కనెక్షన్స్ ఆప్షన్ ట్యాప్ చేయాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్ బూస్టర్ బటన్ మీద స్విచ్ ఆన్ చేయాలి.
మీ సెల్పీ మరింత అందంగా
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉందంటే సెల్ఫీ తీసుకోవడం చాలా సాధారణ విషయం. మరి మీ సెల్ఫీ మరింత అందంగా రావాలంటే... మీ సెల్ఫీ ఫన్నీగా ఉండాలంటే.. ? ఈ ప్రశ్నలకు శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లో సమాధానం ఉంది. ఈ మోడల్స్‌లో ఉండే ఫిల్టర్స్ ఆప్షన్ ద్వారా మన సెల్ఫీలను మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. వాటిక మేకప్ చేయచ్చు. 31 కార్టూన్ ఫిల్టర్ల ద్వారా మన సెల్ఫీలను ఫన్నీగా మలుచుకోవచ్చు.
యాప్‌లను పద్ధతిగా...
మన ఫోన్‌ను ఒకసారి చూసుకుంటే యాప్‌లు చిందరవందరగా కనబడతాయి. ఎక్కడ ఏ యాప్ ఉందో తెలియదు. ఒక్కోసారి యాప్ డౌన్‌లోడ్ చేసి మరిచిపోతాం కూడా. ఐతే అన్ని యాప్‌లను ఒకే చోటుకు చేర్చడం కూడా కష్టం. అయితే ఎస్ 8 మోడల్‌లో ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు. మన హోమ్ స్క్రీన్ మీదే అన్ని యాప్‌లను మెయిన్‌టెన్ చేసుకునే అవకాశం ఉంది. సెట్టింగ్స్‌లో హోమ్ స్ర్కీన్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. ఆ తర్వాత హోమ్ స్క్రీన్ లే అవుట్‌లో హోమ్ స్క్రీన్ ఓన్లీ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు. మన ఫోన్‌లో ఉన్న యాప్‌లన్నీ ఒకే చోటకు వచ్చేస్తాయి.