వాట్సాప్ లో చాటింగ్ చేసేటప్పుడు... సాధారణ ఎస్సెమ్మెస్ లు పంపించేటప్పుడు, ఈమెయిల్స్ లో ఒక్కోసారి దారుణమైన పొరపాట్లు దొర్తుతుంటాయి. స్పెల్లింగ్ లో ఒక్క లెటర్ తేడా వచ్చినా కూడా ఒక్కోసారి అర్థం మారిపోతుంది. దురర్ధాలు కూడా వస్తుంటాయి. ఆటో కరెక్షన్ ఆప్షన్ ఉంటే ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయి. కానీ... మనం వాడే పదాలన్నీ ఫోన్ డిక్షనరీలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కొత్తగా మనకు కావాల్సిన పదాలను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జీమెయిల్ లో యాడ్ చేసుకోవచ్చు..
* ముఖ్యంగా జీమెయిల్ లో కొత్త పదాలు నేరుగా యాప్ లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇదెలా అనేది మనం వాడే ఫోన్, అందులోని ఓఎస్ పై ఆధారపడి ఉంటుంది.
* సాధారణంగా సెట్టింగ్స్ లోని లాంగ్వేజ్ అండ్ ఇన్ పుట్స్ విభాగం నుంచి ఇది మొదలు పెట్టాలి. ఆ విభాగంలోని పర్సనల్ డిక్షనరీ అనే ఆప్షన్ తీసుకుని అందులో కనిపించే + గుర్తును క్లిక్ చేయాలి. అక్కడ మనకు కావాల్సిన పదాన్ని టైప్ చేయాలి.
* అంతేకాదు.. ఆప్షనల్ గా షార్ట్ కట్స్ కూడా యాడ్ చేయొచ్చు.ఉదాహరణకు హ్యాపీ బర్త్ డే అనేదానికి హెచ్ బీబీ అని మనం తరచూ వాడుతుంటే ఆ పదాన్నే డిక్షనరీకి యాడ్ చేసుకోవచ్చు.
* ఈ ఎడిషన్స్ అన్నీ జీమెయిల్ లో సింక్ చేసుకోవచ్చు. అప్పుడు ఒకవేళ మనం డివైస్ మార్చినా అదే లాగిన్ ఉపయోగిస్తే ఆ డివైస్ లోనూ ఇవన్నీ పనిచేస్తాయి.
పర్సనలైజ్డ్ థర్డ్ పార్టీ కీబోర్డ్స్..
సాధారణంగా డివైస్ కీ బోర్డు డివైస్ డిక్షనరీ నుంచే ఆప్షన్లు తీసుకుంటుంది.. సజెషన్లు ఇస్తుంది. అదే థర్డ్ పార్టీ కీబోర్డు వాడితే వేరేగా ఉంటుంది. ఉదాహరణకు మనం స్విఫ్ట్ కీ వాడుతుంటే అది మొదట్లో కొన్ని పదాలను తప్పుగా చూపించినా మనం పదేపదే అదే పదాలు వాడుతుంటే దాన్ని తప్పుగా చూపించడం మానేస్తుంది. అలా కానప్పుడు మనం ప్రిడిక్షన్ బాక్సులో పదాలను యాడ్ చేసుకోవచ్చు.
అదే స్వైప్ లో అయితే... వర్డ్ చాయిస్ లిస్ట్(WCL) లో నేరుగా టైప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఏవైనా పదాలను తొలగించాలంటే దానిపై కొద్దిసేపు అలాగే ప్రెస్ చేసి ఉంచితే రిమోవ్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు తొలగించేయొచ్చు.
ఆటో కరెక్షన్ డిజేబుల్ చేయడం ఇలా..
ఒకవేళ మనం ఆటోకరెక్షన్ ఆప్షన్ వాడాలనుకోవడం లేదు.. కానీ.. అది తరచూ కరెక్షన్లు చేసి ఇబ్బంది పెడుతోంది. మనం టైప్ చేసే పదాలను దానికి నచ్చినట్లుగా కరెక్టు చేసేస్తుండడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అప్పుడు ఆటో కరెక్షన్ ఆప్షన్ ఆపేయాలి. థర్డ్ పార్టీ యాప్స్ అన్నీ డిజేబుల్ ఆప్షన్ ఇస్తాయి. దాని సహాయంతో డిజేబుల్ చేసేయొచ్చు.
డివైస్ సెట్టింగ్సులోకి వెళ్లి లాంగ్వేజ్ అండ్ ఇన్ పుట్ విభాగం క్లిక్ చేయాలి. అందులోని గూగుల్ కీబోర్డు పై ట్యాప్ చేయాలి. టెక్స్ట్ కరక్షన్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఆటో కరెక్షన్ ఆన్, ఆఫ్ ఉంటుంది. ఆఫ్ చేసేయాలి