వాట్సప్ ఉపయోగిస్తున్న వాళ్లు గ్రూపులు మెయిన్‌టెన్ చేయడం సాధారణ విషయమే. అయితే గ్రూపులో ఎలా ఉండాలి.. ఎలా మెసేజ్‌లు చేయాలన్న విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా గ్రూపులో మెసేజ్‌లు చేయడం మాత్రమే కాదు దీనిలో ఉన్న ఫీచర్లను ఉపయోగించడం కూడా చాలామందికి రాదు. మరి వాట్సప్‌లో ఉన్న ఫీచర్లు ఏమిటి.. గ్రూపు చాటింగ్‌లో మనం తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమిటి?
చెక్ మెసేజ్ రీడ్ స్టేటస్
వ్యక్తిగత చాటింగ్‌లో మాదిరిగానే గ్రూప్ చాటింగ్‌లో కూడా మనం పంపిన మెసేజ్‌ను ఎవరెవరు చూశారో తెలుసుకునే సౌకర్యం ఉంది. వాట్సప్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకటి డెలివర్డ్, రెండోది రీడ్ బై. మెసేజ్ డెలివరీ అయితే వాళ్ల పేర్లు డెలివర్డ్ లేబుల్ కింద కనబడతాయి. ఎవరైనా ఆ మెసేజ్‌లు చదివితే రీడ్ బై అనే లేబుల్ కింద ఆ పేర్లు వస్తాయి.
ప్రైవేటు కన్వర్‌సేషన్
వాట్సప్ గ్రూపులో ఒకరికి ప్రత్యేకించి కూడా మెసేజ్‌లు చేసే అవకాశం ఉంది. ఒక గ్రూపులో ఒక వ్యక్తికి ప్రత్యేకించి మెసేజ్ చేయాలంటే వారి పేరు మీద ట్యాప్ చేస్తే ఒక పాపప్ వస్తుంది. దీనిలో మూడు ఆప్షన్లు ఉంటాయి ఒకటి మెసేజ్, రెండు వాయిస్ కాల్, మూడోది వీడియో కాల్. మెసేజ్ మీద క్లిక్ చేసి కన్వర్‌సేషన్ స్టార్ట్ చేయచ్చు.
ట్యాగ్ పీపుల్
ప్రైవేటు కన్వర్‌సేషన్‌తో పాటు ఒక గ్రూపులో ప్రత్యేకించి ఒకరికి మెసేజ్ చేయాలనుకున్నా.. లేదా వారితో ఏమైనా చెప్పాలని భావించినా వారిని ట్యాగ్ చేయచ్చు. అదే ట్యాగింగ్. దీని వల్ల మీరు ఎవరికైతే మెసేజ్ చెప్పాలనుకుంటున్నారో వారికి ఆ సందేశం చేరుతుంది. గ్రూప్ మ్యూట్ చేసినా కూడా వారికి ఆ మెసేజ్ వెళుతుంది. ఎవరికైనా ట్యాగ్ చేయాలంటే వారి పేరు ముందు ఎట్ ద రేట్ అనే ఆప్షన్ పెట్టి చేయాలి.
గ్రూపు మెసేజ్‌లను సెర్చ్ చేయడం
కొన్ని రోజుల క్రితం గ్రూపులో మీ స్నేహితుడు పంపిన ముఖ్యమైన మెసేజ్‌లను సెర్చ్ చేయాలంటే కూడా మీకు ఆప్షన్ ఉంది. సాధారణంగా చాలామంది అన్ని మెసేజ్‌లను స్క్రోల్ చేసుకుంటూ ముందకెళ్తారు. ఇందుకోసం గ్రూపు చాటింగ్ పై ఉండే మూడు డాట్స్ మీద క్లిక్ చేస్తే సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిలో మీరు సెర్చ్ చేయాలనుకున్న పేరుతో సెర్చ్ చేస్తే చాలు ఆ పర్సన్‌కు సంబంధించిన మెసేజ్‌లను చూడొచ్చు.
లింక్స్, డాక్యుమెంట్స్ సెర్చ్
వాట్సప్ గ్రూపులలో కేవలం మెసేజ్‌లను సెర్చ్ చేయడమే కాదు లింక్స్, డాక్యుమెంట్లను కూడా సెర్చ్ చేయచ్చు. ఇందుకోసం వాట్సప్‌లో మీకు ప్రత్యేకంగా రెండు బటన్స్ ఉన్నాయి. రెండు బటన్స్ ఎందుకంటే మీ పనిని సులభంగా, వేగంగా చేయడానికే. ఫేస్‌బుక్ స్టోరీస్ టిప్స్ తెలుసుకోవాలంటే.. గ్రూప్ చాట్ ఓపెన్ చేసి మీడియా లేబుల్ మీద క్లిక్ చేయాలి. దానిలోనే మీకు డాక్యుమెంట్లు, లింక్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు.