ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్ తర్వాత ఫీచర్లు, రూపంరీత్యా శామ్‌సంగ్ కీ బోర్డు కొత్త హంగులు సంతరించుకుంది. ఇది ఇప్పుడు థర్డ్‌పార్టీ కీ బోర్డు యాప్‌లకు సవాలు విసురుతోంది. ఈ కొత్త ఫీచర్లను వాడుకునే కిటుకులు తెలుసుకుందామా?
CUSTOMIZE TOOLBAR
టూల్‌బార్‌లో చాలా కొత్త సంగతులున్నాయి. ఇమోజీ, జిఫ్, క్లిప్ బోర్డ్, వాయిస్ టైపింగ్, ఒన్ హ్యాండ్ మోడ్ తదితరాలున్నాయి. వీటి వరుసను మన ప్రాధాన్యం ప్రకారం మార్చుకోవచ్చు. ఇందుకోసం కీ బోర్డ్ కుడివైపు మూలనగల చిన్న Down Arrow ఐకాన్‌ను ట్యాప్ చేసి, అక్కడి ఐకాన్లను కావాల్సినట్టు అమర్చుకోవచ్చు. మీరు టైప్ చేసేటప్పుడు షార్ట్‌కట్స్ దాగిఉండి, అదే బార్‌లో సజెషన్స్ కనిపిస్తుంటాయి. అప్పుడు టూల్‌బార్‌ను స్విచ్ చేయాలనుకుంటే ఎడమవైపు మూలన టూల్‌బార్ ఐకాన్‌మీద ట్యాప్ చేస్తే సరి.
DISABLE TOOLBAR
టూల్‌బార్‌ను మీరు ఇష్టపడకపోయినా, మరికొంత స్క్రీన్ స్పేస్ కావాలని భావించినా దాన్ని డిజేబుల్ చేసేయొచ్చు. ఇందుకోసం...
STEP 1: టూల్‌బార్ ఐకాన్‌పై సెట్టింగ్స్‌ను ట్యాప్ చేసి, KEYBOARD LAYOUT AND FEEDBACKను సెలెక్ట్ చేయండి.
STEP 2: ఆ తర్వాత కనిపించే స్క్రీన్‌పై KEYBOARD TOOLBARను ఆఫ్ చేయండి.
ADD EMOJI SHORTCUT BUTTON
మీరు ఇమోజీ ప్రియులైతే, వాటిని అలవోకగా వాడుకునే మార్గమిది. ఇమోజీ షార్ట్‌కట్‌ను వెనక్కు తెచ్చుకోవాలంటే టూల్‌బార్‌ను వదిలించుకోవడమే ఆ మార్గం. దీన్ని డిజేబుల్ చేశాక అన్ని షార్ట్‌కట్‌లూ ‘కామా’ కీ వద్ద లభ్యమవుతాయి. వాటిని వాడుకోవాలంటే ‘కామా’ కీని నొక్కిపట్టుకుని, ఇమోజీ ఆప్షన్‌ను ప్రధాన షార్ట్‌కట్‌గా అమర్చుకోవచ్చు.
ACCESS CLIPBOARD AND LOCK ITEMS
శామ్‌సంగ్ కీ బోర్డ్‌లో టూల్‌బార్ నుంచే క్లిప్‌బోర్డును వాడుకోవచ్చు. ఈ క్లిప్‌బోర్డు టెక్స్ట్‌తోపాటు ఇమేజెస్‌ను కూడా సేవ్ చేస్తుంది. క్లిప్ బోర్డులోని ఇమేజెస్ అదృశ్యం కాకూడదనుకుంటే వాటిని లాక్ చేసుకోవచ్చు. ఇందుకోసం టూల్‌బార్‌లో క్లిప్ బోర్డును ఓపెన్ చేసి అందులోని ఐటెమ్‌పై నొక్కి పట్టుకోవాలి. అప్పుడు ప్రత్యక్షమయ్యే మెనూలో LOCK TO CLIPBOARDను సెలెక్ట్ చేయాలి.
CHANGE KEYBOARD SIZE
శామ్‌సంగ్ కీ బోర్డ్ సైజును కూడా మనమిప్పుడు మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే:-
STEP 1: కీ బోర్డ్ టూల్‌బార్‌పై సెట్టింగ్స్ గేర్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
STEP 2: ఇప్పుడు KEYBOARD LAYOUT AND FEEDBACKను సెలెక్ట్ చేసి, KEYBOARD SIZE AND LAYOUTపై ట్యాప్ చేయండి.
STEP 3: తర్వాత కనిపించే స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే Blue Borderను ఉపయోగించి కీ బోర్డు సైజు మార్చుకోవచ్చు.
గమనిక: ఇదే సెట్టింగ్ కింద కీబోర్డుపైగల నంబర్ కీ వరుసను దాచవచ్చు. కావాలంటే అక్షరాలతోపాటు సింబల్స్, కేరక్టర్స్ ఒకేసారి కనిపించేలా ‘ఎనేబుల్’ చేసుకోవచ్చు. ఆ తర్వాత సింబల్స్‌ను ఇన్‌సర్ట్ చేయడానికి నొక్కి పట్టుకుంటే చాలు.
CHANGE KEYBOARD LAYOUT
కీ బోర్డు సైజును మార్చడమే కాదు... లే-అవుట్‌ను కూడా QWERTY నుంచి T9 మోడ్ లేదా 3x4 కీ ప్యాడ్‌లా మార్చేసుకోవచ్చు. శామ్‌సంగ్ కీ బోర్డులో ఇదొక హిడెన్ ఫీచర్. ఇందుకోసం...
STEP 1: కీ బోర్డ్ సెటింగ్స్... LANGUAGES AND TYPESలోకి వెళ్లాలి.
STEP 2: ఇప్పుడు కనిపించే స్క్రీన్‌పై LANGUAGE మీద ట్యాప్ చేయాలి. తర్వాత కావాలనుకున్న మోడ్‌కు మార్చుకోవచ్చు. ఇవేకాదు... ఇంకా మరికొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తర్వాత తెలుసుకుందాం.