• తాజా వార్తలు

ఎంఐ బ్రౌజ‌ర్‌ను స‌రిగ్గా వాడ‌టానికి బెస్ట్ టిప్స్ ఇవే (పార్ట్-1)

బ్రౌజ‌ర్ లేకుండా ఫోన్‌ను ఊహించ‌గ‌ల‌మా!అందుకే స్మార్ట్‌ఫోన్ అంటే ప‌క్కా బ్రౌజ‌ర్ ఉంటుంది. అంతేకాదు యాప్‌లు ఉంటాయి. అయితే మ‌న‌కు ఎన్ని బ్రౌజ‌ర్‌లు ఉన్నా.. మొబైల్ యాక్సిస్ కోసం మొబైల్ బ్రౌజ‌ర్ అవ‌స‌రం. అయితే ప్లే స్టోర్‌లో ఎన్ని బ్రౌజ‌ర్ యాప్‌లు ఉన్నా కొన్ని మాత్ర‌మే మ‌నకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా షియోమి ఫోన్లు వాడేవాళ్ల‌కు రెండు ఆప్ష‌న్లు ఉంటాయి. ఒకటి గూగుల్ క్రోమ్ రెండోది ఎంఐ బ్రౌజ‌ర్‌. గూగుల్ క్రోమ్ మ‌న‌కు తెలిసిందే.. మ‌రి ఏంటి ఎంఐ బ్రౌజ‌ర్‌.. దీనిలో ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటి?

స్వైప్ చేంజ్ చేయ‌డం
ఎంఐ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించిన‌ప్పుడు కుడి నుంచి ఎడ‌మ వైపు స్వైప్ చేసిన‌ప్పుడు ఇది మ‌ళ్లీ మీకు వెన‌క్కి కూడా అదే విధంగా వ‌స్తుంది. దీని వ‌ల్ల మీకు బ్రౌజింగ్ సుల‌భంగా ఉంటుంది.  కొంత‌మందికి అన‌వ‌స‌రంగా స్పైప్ చేసిన‌ప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఏదైనా ఫామ్స్ ఫిల్ చేసే స‌మ‌యంలో మ‌న‌కు ఈ ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఇలాంటప్పుడు ఈ ఎడ్జ్ ఫీచ‌ర్ మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

క్లోజ్ ట్యాబ్స్
ట్యాబ్‌ల‌ను క్లోజ్ చేయాలంటే స్క్రీన్ మీద మ‌నం క్లిక్ చేస్తాం. హోమ్ స్క్రీన్ నుంచి మ‌నం ఈ ట్యాబ్‌ల‌ను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఐతే హోమ్ స్క్రీన్ నుంచే ఈ ట్యాబ్‌ల‌ను క్లోజ్ ,చేసే అవ‌కాశాన్ని ఎంఐ బ్రౌజ‌ర్ క‌ల్పిస్తోంది. . దీని కోసం ట్యాబ్ స్విచ‌ర్ మీద హోల్డ్ చేసి ట్యాప్ చేయాలి. అప్పుడు మీకో డిలీట్ బ‌ట‌న్ క‌నిపిస్తుంది.ఆ డిలీట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే చాలు.. మీ ట్యాబ్‌లు క్లోజ్ అయిపోతాయి. 

కొత్త ట్యాబ్ ఓపెన్ చేయ‌డం
మీరు కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు. .ట్యాబ్ స్విచ‌ర్ ఐకాన్ మీద క్లిక్ చేసి న్యూ ఐకాన్ మీద ట్యాప్ చేస్తారు. కానీ ఎంఐ బ్రౌజ‌ర్లో మాత్రం హోమ్ ఐకాన్‌ను ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే చాలు కొత్త ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది.

లాంచ్ సెర్చ్‌
మీరు ఏదైనా సెర్చ్ చేయాలంటే ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అడ్రెస్ బార్‌ను ట్యాప్ చేసి మీరు సెర్చ్ చేయాల‌నుకుంటున్న లెట‌ర్స్‌ను కీబోర్డ్లో టైప్ చేయాల్సి ఉంటుంది. పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్ల‌కు సెర్చ్ బార్‌ను యూజ్ చేయ‌డం అంత సుల‌భం కాదు. ఇలాంటి స్థితిలో లాంచ్ సెర్చ్ మీకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఉన్న‌త్రి బార్ ఐకాన్‌ను ప్రెస్ చేసి డైరెక్ట్‌గా కీబోర్డు సెల‌క్ట్ చేయకుండానే సెర్చ్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు