మొబైల్ అన్‌లాకింగ్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవడం పాత ఫ్యాషన్. ఇప్పుడంతా ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అన్‌లాక్ చేసుకోవడమే. ఈ ఫీచర్ ఉపయోగాన్ని బాగా గుర్తించిన సెల్‌ఫోన్ కంపెనీలు కూడా ఆరేడు వేల రూపాయల బేసిక్ మోడల్ స్మార్ట్ ఫోన్స్‌లో కూడా ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను తీసుకొస్తున్నాయి. అయితే మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న ఫింగర్ ప్రింట్ రీడర్ మీ వేలిముద్రల్ని సరిగ్గా గుర్తించట్లేదా? అయితే మీ ఫింగర్‌ప్రింట్స్‌ను మొబైల్‌లో సులువుగా స్టోర్ చేయడానికి ఈ కింద టిప్స్ ఫాలో అవండి
ఎలా స్టోర్ చేయాలి?
ఐఫోన్ లో అయితే Settings > Touch ID & Passcode > Fingerprintsలోకి వెళ్లాలి. అదే ఆండ్రాయిడ్‌లో అయితే Settings > Security > Device/Phone Securityలోకి వెళ్లాలి.
వేలిముద్ర నమోదు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1 . చూపుడు వేలు లేదా బొటన వేలిని వాడటం ఉత్తమం. అప్పుడు మనం ఫోన్‌ను పట్టుకున్న చేత్తోనే దాన్ని అన్‌లాక్ చేయడం ఈజీ అవుతుంది.
2 . రెండు చేతుల వేళ్ల ముద్రలను నమోదు చేయవచ్చు. ఒకవేళ మీ వేలికి ఏదైనా దెబ్బ తగిలితే అప్పుడు రెండో వేలితో ఈజీగా అన్‌లాక్ చేసుకోవచ్చు. అంటే ముందు జాగ్రత్త అన్నమాట.
3 . వేలిముద్ర నమోదు చేసేటప్పుడే ఆ వేలి పేరుని ఇస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా మార్చుకోవాలన్నా సులువు అవుతుంది.
4 . వేలిముద్ర నమోదు చేసే సమయంలో పూర్తిగా వేలిముద్రను 360 డిగ్రీల కోణంలో నమోదు చేయాలి. అంటే మీ వేలు మొత్తం ఒకేసారి ఫింగర్‌ప్రింట్ స్కానర్ మీద ఆని ఉండాలి. ఇలా చేయటం వల్ల ఫోన్ త్వరగా అన్‌లాక్ చేయొచ్చు.
5. మీతోపాటు ఇంట్లోవాళ్ల (భార్య/భర్త _ వేలిముద్రను కూడా ఫోన్‌లో నమోదు చేసుకోవచ్చు.
కాలి బొటనవేలును కూడా చేయొచ్చా?
కాలి బొటనవేలిని కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద నమోదు చేయొచ్చు. చాలా ఫోన్లలో ఇది వర్కవుట్ అవుతుంది. చేతివేళ్లలో లోపం ఉంటే ఇలా కూడా వాడుకోవచ్చని కొంతమంది నిరూపించారు.