• తాజా వార్తలు

వాట్సాప్ స్టేట‌స్‌తో వండ‌ర్స్ చేయ‌డానికి ట్రిక్స్ పార్ట్ -2

వాట్స‌ప్ స్టేట‌స్‌లో వండ‌ర్స్ చేయ‌డానికి గ‌త ఆర్టిక‌ల్‌లో కొన్ని ట్రిక్స్ తెలుసుకున్నాం. అంత‌కు మించి మ‌జా ఇచ్చే మ‌రిన్ని ట్రిక్స్ కోసం చ‌దవండి మ‌రి..

ఫాస్ట్ ఫార్వ‌ర్డ్ చేసేయండి
స్టేట‌స్ న‌చ్చితే చూస్తాం.న‌చ్చ‌క‌పోయినా అది పూర్త‌య్యే వ‌ర‌కు చూడాల్సిన ప‌ని లేదు. జ‌స్ట్ ఫాస్ట్ ఫార్వ‌ర్డ్ చేసేయొచ్చు. ఫోన్ టాప్‌లో కుడి చివ‌ర క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టేట‌స్‌లోకి వెళ్లిపోతాం. అలాగే బ్యాక్‌వ‌ర్డ్ కావాలంటే ఎడమ చివ‌ర టాప్ చేయాలి. 

జూమ్ స్టేట‌స్‌
స్టేట‌స్‌లో ఉన్న కంటెంట్‌ను పెద్ద‌గా చూడాలంటే దాన్ని జూమ్ చేయొచ్చు కూడా. రెండు వేళ్ల‌తో దాన్ని పించ్ చేస్తే చాలు స్టేట‌స్‌లో ఉన్న ఇమేజ్ జూమ్ అవుతుంది. అయితే స్టేట‌స్‌లో ఉన్న వీడియోను ఇలా జూమ్ చేయ‌లేం. 

స్టేట‌స్‌కి లొకేష‌న్ యాడ్ చేయండి
మీరు స్టేట‌స్‌లో మీ ఫొటో అప్‌లోడ్ చేశారు.. అరే బాగుంది మామా ఎక్క‌డ ఈ ఫోటో అని ఫ్రెండ్స్ అడుగుతారు. మీరు వాళ్ల‌కి రిప్ల‌యి ఇస్తారు. అలాకాకుండా నేరుగా ఆ  ఫోటో మీదే లొకేష‌న్ యాడ్ చేయొచ్చు. స్టేట‌స్‌లో యాడ్ చేయ‌డానికి ఫొటో సెలెక్ట్ చేశాక పైన ఉన్న ఎమోజీ సింబ‌ల్‌ను క్లిక్ చేస్తే టాప్‌లోనే లొకేష‌న్ అనే బ్యాడ్జి క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ లొకేష‌న్ యాడ్ చేయొచ్చు. ఆటో లొకేష‌న్ యాడ్ చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి లొకేష‌న్ ప‌ర్మిష‌న్ ఆన్ చేయాలి. 

ఎమోజీకి క‌ల‌ర్ మార్చేయండి
వాట్సాప్‌లో ఎమోజీల గురించి తెలియని వారెవ‌రూ ఉండ‌రు. కానీ ఆ ఎమోజీలు ఎల్లో క‌ల‌ర్‌లో మాత్ర‌మే ఉంటాయి. వేరే క‌ల‌ర్‌లోకి వాటిని మార్చే ఛాన్సే లేదు. అయితే రంగు మార్చేందుకు ఓ ట్రిక్ ఉంది. అయితే ఈ ట్రిక్ డైరెక్ట్‌గా చాటింగ్‌లో మీరు ఎమోజీ సెండ్ చేసిన‌ప్పుడు వ‌ర్క‌వుట్ కాదు. కానీ  ఏదైనా ఫోటో మీద పెట్టే ఎమోజీకి మాత్ర‌మే ఈ ట్రిక్ ప‌ని చేస్తుంది. మీరు గ్యాల‌రీలో ఉన్న ఫోటో లేదా కొత్త ఫోటో తీసుకోండి. ఇప్పుడు పైనున్న ఎమోజీ బ‌ట‌న్‌ను క్లిక్ చేయండి. స్క్రీన్ మీద ఎమోజీలు వ‌స్తాయి. మీకు కావాల్సిన ఎమోజీని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు టాప్‌లో ఎమోజీ ప‌క్కనున్న పెన్సిల్ సింబ‌ల్‌ను క్లిక్ చేయండి. క‌ల‌ర్ బార్ వ‌స్తుంది. దాన్ని స్లైడ్ చేస్తే ర‌క‌రకాల రంగులు క‌నిపిస్తాయి. మీకు కావాల్సిన క‌ల‌ర్ సెలెక్ట్ చేసుకున్నాక మ‌ళ్లీ ఎమోజీమీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమోజీ ఆ క‌ల‌ర్‌లోకి మారిపోతుంది. ఇలా ఎన్ని ఎమోజీల‌యినా పెట్టుకుని ఒక్కో దానికి ఒక్కో రంగు ఇచ్చుకోవ‌చ్చు.

కెమెరాను మార్చేయండి
వాట్స‌ప్ కెమెరాతో ఫోటో తీస్తున్నారా?  వీడియో షూట్ చేస్తున్నారా? అయితే మ‌ధ్య‌లో కెమెరాను కావాలంటే ఫ్రంట్, బ్యాక్ కెమెరాల‌కు మార్చుకోవ‌చ్చు. జ‌స్ట్ స్క్రీన్ మీద డబుల్ టాప్ చేస్తే చాలు 
 

జన రంజకమైన వార్తలు