సాధారణంగా మనం ఫోన్‌ను అప్పుడప్పుడు రీస్టార్ట్ చేస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఏదైనా యాప్ స్ట్రక్ అయిపోవడమో లేక ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఫోన్ హ్యాంగ్ అయిప్పుడో రీస్టార్ట్ చేస్తుంటాయి. ఛార్జింగ్ పూర్తిగా అయిపోయినప్పుడు కూడా రీస్టార్ట్ అవుతుంది మన ఫోన్. అయితే రీస్టార్ట్ అయిన వెంటనే మన ఫోన్ ఇంతకముందు కంటే వేగంగా పని చేయడాన్ని గమనించారా? .. రీస్టార్ట్ చేయగానే ఎందుకు ఇలా ఫోన్ ఫాస్ట్ అయింది. ఏమిటి కారణం?
అంతా ర్యామ్ వల్లే!
మన ఫోన్ ఫెర్‌ఫార్మ్ చేసేది ర్యామ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన ర్యామ్ యూసేజ్ మీదే దీని పనితీరు డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న మోడ్రన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ యాప్స్ వాడకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఎక్కువ యాప్స్ ఉంటే అవి ర్యామ్‌ను ఎక్కువగా తినేస్తాయి. ఆక్రమిస్తాయి. మీరు ఎంత ఎక్కువగా యాప్స్ వాడితే అంతగా ర్యామ్ ఖర్చు అయిపోతుంటుంది. మీరు యాప్స్ క్లోజ్ చేసినా.. లేదా మాన్యువల్‌గా మీ డివైజ్ నుంచి తీసేసినా ర్యామ్ మళ్లీ పరుగులు పెడుతుంది.
ఫ్రీ ర్యామ్ వల్ల ఉపయోగం లేదు..
అయితే యాప్స్ వాడకుండా... ఏ యూసేజ్ లేకుండా ఉంటే ర్యామ్ సూపర్‌గా పని చేస్తుంది. కానీ ఏంటి లాభం? .. చేతిలో సెల్‌ఫోన్ ఉండి ఏంటి ఉపయోగం? అందుకే ర్యామ్‌ను ఒక పద్ధతిలో ఉపయోగించుకోవాలి. అవసరమైన యాప్‌లను కచ్చితంగా ఫోన్లో ఉంచుకోవాలి. యునిక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కువై పోవడం వల్ల ర్యామ్ పని తీరు కూడా తగ్గిపోతుంది. అయితే ఇలా జరిగిప్పుడు మళ్లీ ర్యామ్ పరుగెత్తాలంటే ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ర్యామ్ మళ్లీ క్లియర్‌గా ఉంటుంది. వేగంగా పని చేస్తుంది. దీనికి కారణం ఓపెన్ యాప్స్ కిల్ కావడమే. ర్యామ్ ఒకసారి క్లీన్ అయిపోతుంది. అయితే రీస్టార్ట్ వల్ల మరీ గొప్ప ప్రయోజనం లేకపోయినా.. కచ్చితంగా ఉపయోగమైతే ఉంది.