గూగుల్ మ్యాప్ ఇప్పుడు అందరికీ అలవాటయింది. లొకేషన్ షేర్ చేస్తే చాలు పెద్దగా చదువుకోని క్యాబ్ డ్రైవర్, ఫుడ్ డెలివరీ బాయ్‌కూడా గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ అక్కడికి రీచ్ అయిపోతున్నారు. తాజాగా గూగుల్ మ్యాప్స్‌లో మరిన్ని సూపర్ ఫీచర్లు యాడ్ అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
1. షేర్ రియల్ టైమ్ లొకేషన్
గూగుల్ మ్యాప్స్‌లో మీరున్న లొకేషన్‌ను షేర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం మీ రియల్ టైమ్ లొకేషన్‌ను ఒకేసారి ఎక్కువ మందితో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌లోని నావిగేషన్ డ్రాయర్‌లో ఉంటుంది. ఆ ఆప్షన్‌ను టాప్ చేసి మీరు రియల్ టైం లొకేషన్‌ను గంట లేదా కొన్ని గంటలు లేదా మీరు మాన్యువల్‌గా ఆఫ్ చేసేవరకు షేర్ చేయొచ్చు. ఈ రియల్ టైమ్ లొకేషన్ ఒక లింక్ ద్వారా మీరు షేర్ చేసిన వారందరికీ చేరుతుంది. మీరు ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు మీరు ఎక్కడున్నారో అవతలి వ్యక్తికి వివరించలేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ రియల్ టైమ్ లొకేషన్ ఫీచర్‌తో షేర్ చేస్తే అవతలి వ్యక్తి మీరు ఎక్కడున్నారో గుర్తుపట్టి అక్కడి నుంచి మీరు ఎలా రావాలో చెప్పగలుగుతారు. అంటే అడ్రస్ కనుక్కోవడం మరింత ఈజీ అవుతుందన్నమాట.
2. మీ పార్కింగ్ లొకేషన్‌ను సేవ్ చేసుకోండి
మాల్‌కో, షాపింగ్ కాంప్లెక్స్, ఎగ్జిబిషన్లకు వెళ్లినప్పుడు మీరు కారు ఎక్కడ పార్క్ చేశారో తర్వాత వచ్చి చూస్తే గుర్తుండదు. కారు ఎక్కడుందో నంబర్ వెతుక్కుంటూ వెళుతుంటారు చాలామంది. గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన లేటెస్ట్ ఫీచర్‌తో ఇకపై ఈ బాధలుండవు. మీరు కారు పార్క్ చేసిన స్పాట్‌ను గూగుల్ మ్యాప్‌లో సేవ్ చేసుకోవచ్చు.
* కార్ పార్క్ చేసిన తర్వాత మీ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి.
* మీ లొకేషన్‌ను చూపించే బ్లూడాట్ మీద టాప్ చేయండి.
* ఇప్పుడు మీకు Save Your Parking అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సేవ్ చేయండి.
* కావాలంటే బ్లూడాట్‌ను మూవ్ చేసి పార్కింగ్ స్పేస్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.
* అంతేకాదు దీనికి కొంత ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయొచ్చు. లొకేషన్ గురించి నోట్స్ రాసుకోవచ్చు. పార్కింగ్ టైమ్ ఎన్నిగంటల వరకు ఉందో కూడా సెట్ చేసుకోవచ్చు.
3: మల్టిపుల్ స్పాట్స్‌ను యాడ్ చేసుకోండి
కొత్త ప్రదేశానికి వెళుతున్నారు. డెస్టినేషన్ మ్యాప్స్‌లో సెట్ చేసుకుంటే అక్కడికి ఎలా వెళ్లాలో రూట్ చూపిస్తూ ఉంటుంది. మరి దారిలో పెట్రోల్ బంక్, రెస్టారెంట్, బార్ లాంటివి ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే.. దీనికి పరిష్కారంగా నావిగేషన్ బార్‌లో మల్లిపుల్ స్పాట్స్‌ను యాడ్ చేసుకునే కొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది.
మ్యాప్స్ ఓపెన్ చేశాక టాప్‌లో ఉండే త్రీడాట్స్ బటన్‌ను ఓపెన్ చేసి ఒక ప్లేస్‌ను సెట్ చేసుకోండి. తర్వాత Add Stop బటన్‌ను టాప్ చేసి రెస్టారెంట్ , పెట్రోల్ బంక్ లాంటివి యాడ్ చేయండి. యాడ్ స్టాప్ బటన్‌ను ఎన్నిసార్లు టాప్ చేస్తే అన్ని స్పాట్స్‌ను యాడ్ చేసుకోవచ్చు.