• తాజా వార్తలు

మీ పెట్రోల్ ఖ‌ర్చుల‌ని త‌గ్గించే గూగుల్ మ్యాప్స్ సూప‌ర్ ట్రిక్‌

రోజురోజుకూ పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు వాహ‌న‌దారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. బండి తీయాలంటేనే గుండెలు గుబేలుమంటున్నాయి. పొదుపుగా, ఆచితూచి పెట్రోలు, డీజిల్‌ను వాడుకోవాల్సిన స‌మ‌యంలో.. ట్రాఫిక్ స‌మ‌స్య కూడా మ‌రింత భారాన్ని పెంచుతోంది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు గూగుల్ మ్యాప్స్ ఒక ఉత్త‌మ ప‌రిష్కారంలా క‌నిపిస్తోంది. గూగుల్ మ్యాప్స్ అంటే.. ఒక ప్ర‌దేశం మ‌రో ప్ర‌దేశానికి ఎలా వెళ్లాలో తెలిపే నావిగేష‌న్ సిస్ట‌మ్ అని తెలుసు. కానీ దీని ద్వారా గ‌మ్యాన్ని తక్కువ దూరంలో చేరుకోవ‌డంతో పాటు పెట్రోలు ఖ‌ర్చులు కూడా ఆదా చేస్తుంద‌ని కూడా తెలుసుకోండి. అదెలానో ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా తెలుసుకుందాం!

డెస్క్‌టాప్ యూజ‌ర్ల‌యితే..
* బ్రౌజ‌ర్లో గూగుల్ మ్యాప్స్‌ని ఓపెన్ చేయాలి.
* స్టార్టింగ్ పాయింట్‌ని జూమ్ చేసి.. దాని మీద మౌస్ సాయంతో రైట్ క్లిక్ చేయాలి.
* డ్రాప్ డౌన్ మెనూలో Measure ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.
* త‌ర్వాత మ‌నం వెళ్లాల‌నుకుంటున్న లొకేష‌న్ మీద క్లిక్ చేయాలి. ఒక‌వేళ రెండు మూడు ప్రాంతాల మ‌ధ్య దూరాన్ని తెలుసుకోవాల‌నుకుంటే ఆ ప్రాంతాల‌ను కూడా సెల‌క్ట్ చేసుకోవాలి. 
* త‌ర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి చివ‌రి పాయింట్ మ‌ధ్య ఒక లైన్ ఏర్ప‌డుతుంది. దీనిని మౌస్ సాయంతో అటూ ఇటూ డ్రాగ్ చేసుకుంటూ వెళితే.. రెండు పాయింట్ల మ‌ధ్య ఎలా వెళితే ఎంత దూరం ఉంటుందో స్క్రీన్ మీద చూపిస్తుంది. 

స్మార్ట్‌ఫోన్‌లో..
* గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి
* మ‌నం ఎక్క‌డి నుంచి బ‌య‌లుదేరే రెడ్ పిన్ సాయంతో గుర్తించాలి.
* అక్క‌డ మ్యాప్ కింద.. లొకేష‌న్ ఎంట‌ర్ చేయాలి. 
* pop-up menuలో Measure distance ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.
* త‌ర్వాత మ్యాప్ మీద డ్రాగ్ చేస్తే బ్లాక్ స‌ర్కిల్ పాయింట‌ర్ క‌నిపిస్తుంది. దీనిని మ‌న‌కు కావాల్సిన లొకేష‌న్ ద‌గ్గ‌ర ఉంచాలి. 
* మ‌రిన్ని లొకేష‌న్స్‌ను యాడ్ చేయడానికి + మీద క్లిక్ చేయాలి. 
* ఇవ‌న్నీ పూర్త‌యిన త‌ర్వాత స్క్రీన్ కింద.. ఆ రెండు ప్రాంతాల మ‌ధ్య దూరం కనిపిస్తుంది. 
* ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఫోన్ల‌లో ఇదే ప‌ద్ధ‌తి ఫాలో అవ్వాలి. సో త‌క్కువ దూరంలో గ‌మ్యాన్ని చేరుకుని పెట్రోలు, డీజిల్ ఖ‌ర్చులు ఆదా చేసుకోండి.

 

జన రంజకమైన వార్తలు