తమ సైట్‌లో ఎక్కువ సమయం యూజర్లు ఉండేలా సోషల్ మీడియా సైట్లు కొత్త కొత్త ఆప్షన్లు ప్రవేశపెడుతుంటాయి. ఇవి ఇష్టం లేకపోయినా వినియోగదారులపై బలవంతంగా రుద్దుతూ ఉంటాయి. వీటిని డిజేబుల్ చేయాలన్నా కష్టమే. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లోనూ ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంది. అదే Keep scrolling for more. ఫేస్‌బుక్‌లో న్యూస్ ఫీడ్ అంతా ఒకేసారి చూపించకుండా ఈ News Feed ఫీచర్‌ని తీసుకొచ్చి యూజర్లపై రుద్దేస్తోంది. ఫేస్‌బుక్‌లో ఉన్న కొత్త కంటెంట్‌ని చూసేందుకు దీనిని ప్రవేశపెట్టినా.. తమ సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో ఎక్కువ సేపు యూజర్లను ఉంచేందుకు బాగా ఉపయోగపడుతోంది. మరి ఈ ఆప్షన్‌ను డిజేబుల్ చేసేందుకు కొన్ని ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి.
FACEBOOK LITE
ఫేస్‌బుక్ ఒరిజినల్ యాప్(60 ఎంబీ)తో పోల్చుకుంటే ఫేస్‌బుక్ లైట్(2 ఎంబీ) యాప్‌లో యానిమేషన్లతో పాటు ఇతర ఫీచర్లు వంటివేమీ ఉండవు. సో.. Keep scrolling for more ఫీచర్‌ని సపోర్ట్ చేయదు.
THIRD-PARTY FB APP
ఫేస్‌బుక్ స్టాండర్డ్ యాప్‌కీ, ఫేస్‌బుక్ లైట్ యాప్‌కి మధ్య థర్డ్ పార్టీ ఫేస్‌బుక్ యాప్ ఒకటి ఉంది. ఇందులో ముఖ్యమైన ఫీచర్లు అన్నీ ఉండటంతో పాటు అనవసరమైన చెత్త అసలు ఉండనే ఉండదు. ఎక్కువశాతం థర్డ్ పార్టీ యాప్స్ మెరుగైన ఆప్టిమైజేషన్‌తో పాటు అతి తక్కువ వనరులను వినియోగించుకుంటాయి. వీటిలో ఫేస్‌బుక్, వాట్సాప్‌కి Metal అనే యాప్ అందుబాటులో ఉంది. తక్కువ ఎంబీ, నాన్ ఇన్‌వాసివ్‌తో పాటు ఎన్నో అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పైన చెప్పిన ఫీచర్లను బ్లాక్ చేసే బిల్ట్ ఇన్ మెకానిజమ్‌తో పాటు థీమ్‌లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
BROWSER EXTENSION (FB PURITY)
డెస్క్‌టాప్ యూజర్ల కోసం Keep scrolling for more ఫీచర్‌ని బ్లాక్ చేయడానికి F.B. (FluffBusting) Purity అనే ఎక్స్‌టెన్షన్ అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్‌కి సంబంధం లేని కంటెంట్‌ని బ్లాక్ చేసి సాఫీగా బ్రౌజింగ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌ని కస్టమైజ్ చేసుకునేందుకు అనేక రకాల ఆప్షన్లు ఉంటాయి. ముఖ్యంగా మనల్ని అన్‌ఫ్రండ్ చేసిన వారిని తెలుసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్నాక.. FBP ఐకాన్ ఫేస్‌బుక్‌లో కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళితే.. రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. మనకి కావాల్సిన ఆప్షన్లు సెలక్ట్ చేసుకుని సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చాలు.