• తాజా వార్తలు

ఇల్లు అందంగా కనిపించేందుకు స్మార్ట్ సొల్యూషన్స్ మీ కోసం.

ఇంటర్నెట్ పరిధి అమితవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈకో సిస్థం అనేది నేడు ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అయితే ఇప్పటిదికా ఈ ఈకో సిస్టం ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ కంపెనీలు మాత్రం ఈకో సిస్టంకు సంబంధించిన అనేక రకాలైన గాడ్జెట్లను మార్కెట్లోకి  తీసుకువస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు ఈకో సిస్టం గాడ్జెట్లను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ శీర్షికలో భాగంగా మీ బెడ్ రూంని అత్యంత ఆకర్షణీయంగా చేసే గాడ్జెట్ల గురించి  వివరిస్తున్నాం.  

Syska TL-1007-I Smart Table Lamp
ఈ 7 watts(W)టేబుల్ ల్యాంప్ అమెజాన్ ఈకో , అలాగే గూగుల్ హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం వాయిస్ కంట్రోల్ ఆధారంగానే వీటిని మీరు నియంత్రించుకోవచ్చు. మీరు బ్రైట్ నెస్ లెవల్స్ పెంచుకోవాలన్నా, నైట్ మోడ్ కి మార్చుకోవాలన్నా , అలాగే చదువుకునేందుకు అనుగుణంగా లైటింగ్ మార్చుకోవాలన్నా కేవలం వాయిస్ ఆధారంగానే చేయవచ్చు.  దీని ధర రూ. 3,699

Philips Hue
Philips’ Hue series లైట్లు మీ హోమ్ కి బెస్ట్ సొల్యూషన్ ఇచ్చేందుకు ఎల్లప్పుడూ రెడీగా ఉంటాయని చెప్పవచ్చు. 10W smart bulb కంపెనీ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ బల్బ్ గా చెప్పవచ్చు. వన్ ఇయర వారంటీతో వస్తోంది. ఇది కూడా  అమెజాన్ ఈకో , అలాగే గూగుల్ హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం వాయిస్ కంట్రోల్ ఆధారంగానే వీటిని మీరు నియంత్రించుకోవచ్చు.దీంతో పాటు ఆపిల్ హోమ్ కిట్ సపోర్ట్ కూడా చేస్తుంది. సిరి వాయిస్ కమాండ్ ద్వారా దీన్ని సమర్థవంతంగా నియత్రించుకోవచ్చు.దీని ధర రూ. 1,929. 

Wipro Next Smart LED Batten
మీరు చిన్న బల్బ్ ని వాడుతున్నట్లయితే దానికి పక్కనపడేయండి. ఎందుకంటే విప్రో కంపెనీ LED Battenతో చక్కటి పరిష్కార మార్గాన్ని సూచిస్తోంది.వీటిని మీరు Wipro Next Smart app ద్వారా మీ ఫోన్ నుండే నియంత్రణ చేయవచ్చు. అలాగే అమెజాన్ ఈకో , గూగుల్ హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం వాయిస్ కంట్రోల్ ఆధారంగానే వీటిని మీరు నియంత్రించుకోవచ్చు.దీని ధర రూ. 1,499.

Yeelight LED Bulbs
ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ షియోమి ఈ మధ్యనే ఇండియా మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ Yeelight Smart LED Bulbని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనిని Mi Home app ద్వారా కంట్రోల్ చేయవచ్చు. రెండు రకాల వేరియంట్లలో వచ్చింది. మీరు దీని ద్వారా బ్రైట్ నెస్ ని కంట్రోల్ చేయవచ్చు. అమెజాన్ ఈకో , గూగుల్ హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం వాయిస్ కంట్రోల్ ఆధారంగానే వీటిని మీరు నియంత్రించుకోవచ్చు.దీని ధర రూ. 1,499గా ఉంది.

Homemate Wi-Fi Multicolour Smart LED Strip
మీ మూడ్స్ కి అనుగుణంగా మీరు ఈ స్మార్ట్ ఉత్పత్తులను సెట్ చేసుకోవచ్చు. కంపెనీ మీ మూడ్ ని బట్టి ఏది వాడాలో అనే దాని మీద తన ఉత్పత్తులను పరిచయం చేసింది.ఈ గాడ్జెట్లు అలెక్సా, గూగుల్ హోమ్ సపోర్ట్ తో వచ్చాయి.అలాగే కంపెనీ సొంత యాప్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. IFTTT appని ఉపయోగించి మీకు నచ్చిన విధంగా ఈ లైట్లను సెట్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 2,790గా ఉంది. అమెజాన్ లో అందుబాటులో ఉంది. 

జన రంజకమైన వార్తలు