• తాజా వార్తలు

వాట్స్ అప్ స్పీడ్ గా రన్ అవ్వాలా? అయితే ఈ టిప్స్ మీకోసమే

ప్రస్తుతం ఉన్న మోస్ట్ పాపులర్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ లలో వాట్స్ అప్ ఒకటి. అయినప్పటికీ దీనికో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది వాట్స్ అప్ అప్పుడప్పుడూ స్లో అవుతూ ఉంటుంది. అయితే ప్రతీ విషయానికీ వాట్స్ అప్ పై బాధ్యత వేయకుండా చిన్న చిన్న టిప్స్ పాటించడo ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వాట్స్ అప్ ను స్పీడ్ అప్ చేసుకునే ట్రిక్స్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మీ ఇంటర్ నెట్ కనెక్టివిటీ ను చెక్ చేసుకోండి

మీ వాట్స్ అప్ సరిగా కనెక్ట్ అవడం లేదా అయితే దీనికి ప్రధాన కారణం మీ నెట్ వర్క్ ది అయి ఉండవచ్చు. అందుకే ముందుగా మీ ఫోన్ లోని నెట్ వర్క్ సరిగా పని చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. కాసేపు మీ ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో ఉంచి తిరిగి ఫ్లైట్ మోడ్ ను ఆఫ్ చేయాలి. లేదా వైఫై /డేటా మోడ్ ను కాసేపు ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయాలి. లేదా మే ఫోన్ ను రీస్టార్ట్ చేసినా సరే ఒక్కోసారి కనెక్టివిటీ సమస్య తీరే అవకాశం ఉంది.

వాట్స్ అప్ కాచే మరియు డేటా ని క్లియర్ చేయండి

వాట్స్ అప్ స్పీడ్ ను పెంచుకునే మరొక మార్గం వాట్స్ అప్ కాచే ను మరియు డేటా ను ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం. డేటా డిలీట్ చేయడం వలన మీ సంభాషణలు, ఫోటో లు, వీడియో లు కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంది కావున ముందుగా మ్వీకు అవసరమైన డేటా ను సేవ్ చేసుకుని ఆ తర్వాత డిలీట్ చేసుకోవాలి. బ్యాక్ అప్ కోసం వాట్స్ అప్ > సెట్టింగ్స్> చాట్స్ > బ్యాక్ అప్ ఇలా చేయాలి. డిలీట్ చేయడానికి సెట్టింగ్స్> యాప్ సెట్టింగ్స్> ఇన్ స్టాల్డ్ యాప్స్ > వాట్స్ అప్ > డిలీట్ కాచే డేటా ఇలా చేయాలి.

మీ వాట్స్ అప్ ను అప్ టు డేట్ గా ఉంచండి.

వాట్స్ అప్ అనేది రెగ్యులర్ గా అప్ డేట్ అవుతూ ఉంటుంది.  దీనిని అప్ టు డేట్ గా ఉంచకపోవడం వలన కూడా ఒక్కోసారి స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు మీ వాట్స్ అప్ ను అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి. ప్లే స్టోర్> సెట్టింగ్స్> ఆటో అప్ డేట్ యాప్స్ ద్వారా మీ వాట్స్ అప్ ను అప్ డేట్ చేసుకోవచ్చు.

తగినంత మెమరీ ఉండేలా చూసుకోండి

మన ఫోన్ లో తగినంత స్టోరేజ్ లేకపోయినా RAM తక్కువ అయినా వాట్స్ అప్ స్లో డౌన్ అవుతుంది. అందువలననే మన ఫోన్ లో ఎప్పటికప్పుడు తగినంత స్టోరేజ్ ఉండేట్లు చూసుకోవాలి. అలాగే తరచుగా ర్యాం ను ఫ్రీ చేసుకుంటూ ఉండాలి. కొన్ని అనవసరమైన ఫోటో లను ఎప్పటికపుడు డిలీట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో ఎలాంటి యాప్ లు రన్ అవకుండా ఎప్పటికపుడు ఫ్రీ చేస్తూ ఉండాలి.

డెస్క్ టాప్ లకు వాట్స్ అప్ వెబ్ ను ఉపయోగించండి.

మీ దగ్గర లాప్ టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఉందా? అయితే ఫోన్ లో ఉపయోగించే బదులుగా మీ వాట్స్ అప్ ను డెస్క్ టాప్ లో కానీ లాప్ టాప్ లో కానీ ఉపయోగించవచ్చు. వెబ్ వాట్స్ అనే ఆప్షన్ ద్వారా ఇలా చేయవచ్చు. ఇలాచేయడం వలన మీ ఫోన్ పై పడే అదనపు భారాన్ని తగ్గించవచ్చు.

జన రంజకమైన వార్తలు