• తాజా వార్తలు

మీ వాట్సాప్ చాట్‌ను హైడ్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్!

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్...ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సెక్యూరిటీ ఫీచర్ అయిన సేఫ్ గార్డుని వాట్సాప్‌లోకి  తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ చాటింగ్‌ను హైడ్ చేయవచ్చు. ఫేస్ఐడి, పాస్‌వ‌ర్డ్ ద్వారా మీరు మీ చాటింగ్‌ను రహస్యంగా ఉంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్‌లో కూడా ఇది రన్ అవుతుంది. ఈ సింపుల్ ట్రిక్స్ మీరు ఫాలో అవుతే రెండు వర్షన్లలోనూ ఆపరేట్ చేసుకోవచ్చు. 

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎలా హైడ్ చేయాలి...

1. ముందుగా మీ వాట్సాప్ ను ఓపెన్ చేయండి.
2.అందులోకి చాట్ స్క్రీన్ ఓపెన్  చేసి...దాన్ని ట్యాప్ చేయండి. 
3. అలా చేయగానే మీకు కుడి పక్కన ఆర్చివ్ ఐకాన్ కనిపిస్తుంది. 
4.ఇప్పుడు దానిపై క్లిక్ చేయండి.

దీంతో మీ చాట్ ఆర్చివ్ లోకి వెళ్తుంది. కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు. మీ ఆండ్రాయిడ్, స్మార్ట్‌ఫోన్లలో కొంత భాగంలో ఆర్చివ్ చాట్‌ను చూసేందుకు వీలుంటుంది. 

ఐఫోన్లలో ఎలా హైడ్ చేయాలి....

1. ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. 
2. ఇప్పుడు అందులోని చాట్ స్క్రీన్ ఓపెన్ చేసి...మీ వేళ్లతో దాన్ని స్లైడ్ చేస్తే కుడి కార్నర్ లోని ఎడమ పక్కన మీకు ఆర్చివ్ కనిపిస్తుంది.
3. దానిపై ట్యాప్ చేస్తే చాలు. 

ఆన్ ఆర్చివ్ చేయాలనుకుంటే కింద కనిపించే చాట్ స్క్రీన్లోకి వెళ్లి దానిని అన్ ఆర్చివ్ చేస్తే సరిపోతుంది. ఐఫోన్ లో కూడా ఇలాగే చేయవచ్చు. 
 

జన రంజకమైన వార్తలు