• తాజా వార్తలు

వాట్సాప్ పిన్‌ను మ‌ర్చిపోతే రిక‌వ‌ర్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీ ఫోన్‌లో వాట్సాప్ యూజ్ చేసుకోవాలంటే పిన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాల్సిన ప‌ని లేదు. కానీ మీ ఫోన్ పోతే లేదంటే కొత్త ఫోన్ కొని దానిలో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేస్తే మాత్రం మీ పాత అకౌంట్‌కు వెళ్లాలంటే పిన్ నెంబ‌ర్ అవ‌స‌రం. ఇంత‌కుముందు ఈ సెట‌ప్ లేదు. కానీ యూజ‌ర్ల డేటా సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్ట‌ర్ వెరిఫికేష‌న్ ఉప‌యోగించుకుంటే మాత్రం మీరు కొత్త ఫోన్‌లో వాట్సాప్ వాడాల‌నుకున్నా లేదా పాత ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను కొత్త‌గా ఇన్‌స్టాల్ చేసినా పిన్ నెంబ‌ర్ క‌చ్చితంగా కావాలి. ఒక‌వేళ మీరు ఆ 6 అంకెల పిన్ నెంబ‌ర్ మ‌ర్చిపోతే దాన్ని రిక‌వ‌ర్ చేయ‌డం ఎలాగో ఈ ఆర్టిక‌ల్‌లో చూద్దాం. 

ఎలా రిక‌వ‌రీ చేసుకోవాలో చూడండి
1. వాట్సాప్ ఓపెన్ చేయండి. టూ స్టెప్ వెరిఫికేష‌న్‌లో పిన్ అడిగితే వెంట‌నే “Forgot PIN” ను క్లిక్ చేయండి.

2.  ఓ పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. దానిలో ఉన్న  “Send Email” ఆప్ష‌న్‌ను టాప్ చేయండి. (మీరు టూ స్టెప్ వెరిఫికేష‌న్ తీసుకునేట‌ప్పుడు మెయిల్ ఐడీ ఇవ్వాలి. దానికే ఈ మెయిల్ వ‌స్తుంది.) త‌ర్వాత OK బ‌ట‌న్ నొక్కండి.

3. మీ ఈమెయిల్‌కు ఓ లింక్ వ‌స్తుంది. టూ స్టెప్ వెరిఫికేష‌న్‌ను క్లోజ్ చేసి  ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మీ బ్రౌజ‌ర్‌లో ఉన్న వాట్సాప్ అకౌంట్‌కు తీసుకెళుతుంది.

4. ఇప్పుడు మీ వాట్సాప్‌లోని టూ స్టెప్ వెరిఫికేష‌న్‌ను ట‌ర్న్ఆఫ్ చేయాలా అని అడుతుంది  confirm బ‌ట‌న్ నొక్కండి. అంతే మీ వాట్సాప్ పిన్ రిక‌వ‌రీ పూర్త‌యిన‌ట్లే.

5. మీ వాట్సాప్ అకౌంట్ పూర్తి సెక్యూర్డ్‌గా ఉండాలంటే టూ స్టెప్ వెరిఫికేష‌న్‌ను త‌ప్ప‌నిస‌రి కాబ‌ట్టి set up two-step verification again అనే ఆప్ష‌న్ తీసుకుని స‌బ్మిట్ చేయండి.

వాట్సాప్ అకౌంట్‌కి ఈమెయిల్ ఇవ్వ‌లేదా?
వాట్సాప్ అకౌంట్ సెట‌ప్ చేసేట‌ప్పుడే ఈ మెయిల్ ఐడీ కూడా ఇవ్వాలి. అలా ఇవ్వక‌పోతే మీరు పిన్ నెంబ‌ర్ మ‌ర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవ‌డానికి వారం రోజులు నిరీక్షించాలి. ఈ లోగా మీకు వ‌చ్చిన మెసేజ్‌ల‌న్నీ పోతాయి. కాబ‌ట్టి మీ వాట్సాప్ అకౌంట్‌కి ఈ మెయిల్ లేక‌పోతే వెంట‌నే సెట్ చేసుకోండి. అప్పుడే మీరు టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌తో పూర్తి భ‌ద్రంగా ఉండ‌గ‌లుగుతారు.

జన రంజకమైన వార్తలు