సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. లైవ్ రూమ్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌తో ఒకేసారి నలుగురితో లైవ్ షేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒకరు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉంటే మరొకర్కరినే మాత్రమే యాడ్ చేసుకోగల అవకాశం ఉండేది. కొత్త ఫీచర్‌గా వచ్చిన లైవ్ రూమ్స్‌తో ఒకరు లైవ్ చేస్తున్నప్పుడు నలుగురిని లైవ్‌లో యాడ్ చేసుకోవచ్చు. జూమ్, గూగుల్ మీట్ యాప్‌లు మార్కెట్లో దూసుకుపోతున్న పరిస్థితుల్లో ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ లైవ్ రూమ్స్ ఫీచర్ సోషల్ మీడియా యాప్ ద్వారా లైవ్ సెషన్లు చేయాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుందని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో లైవ్ రూమ్ స్టార్ట్ చేయడం ఎలా?
* ముందుగా మీ ఫోన్ లేదా పీసీలో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
* ఎడమవైపుకు టాప్ చేసి లైవ్ కెమెరా ఆప్షన్‌ను టాప్ చేయండి.
* ఇప్పడు కావాలంటే మీరు లైవ్ సెషన్‌కు పేరు కూడా పెట్టుకోవచ్చు.
* అంతేకాదు మీరు ఎవరినైతే ఆ లైవ్ సెషన్‌లో యాడ్ చేయాలనుకుంటున్నారో వారికి బ్యాడ్జెస్ కూడా ఇవ్వచ్చు
.* లైవ్ సెషన్‌ను నిర్వహిస్తున్న బ్రాడ్‌కాస్టర్ టాప్‌లో ఉంటారు. మరో ముగ్గురిని యాడ్ చేసుకోవచ్చు. ఈ మ ముగ్గురిని వన్ బై వన్ గానీ, ఒకేసారి ముగ్గుర్ని గానీ యాడ్ చేసుకోవచ్చు.
* గెస్ట్‌ను కావాలంటే లైవ్ సెషన్ నడుస్తున్పప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు.