పిల్లలు అనవసరమైన కంటెంట్ చూడకుండా నియంత్రించడం ఎలా!
ఇంటర్నెట్ విస్తృతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో పిల్లలకు నెట్ చూడడం చాలా సులభం అయిపోయింది. కంప్యూటర్, ల్యాప్‌టాప్ మాత్రమే కాక ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా పిల్లలు నెట్ యాక్సెస్ చేస్తున్నారు. దీని వల్ల వాళ్లు ఏం చూస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ లాంటి వాటిలో మనకు అవసరం లేని కంటెంట్ చాలా అందుబాటులో ఉంది. వీటిని పిల్లలు చూడడం వల్ల దుష్‌ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉంది. మరి ఇలాంటి కంటెంట్ చూడకుండా నిరోధించడం ఎలా? ఇందుకోసం పేరెంటల్ కంట్రోల్ అందుబాటులో ఉంది. మరి యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సైట్లలో వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామా..
యూట్యూబ్‌లో పేరెంటల్ కంట్రోల్ ఇలా..
1. మీ డివైజ్‌లో యూట్యూబ్ ఓపెన్ చేయాలి
2. కుడి చేతి మూలగా ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయాలి
3. సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి
4. కిందకి వచ్చి రిస్ట్రిక్టిడ్ మోడ్ మీద క్లిక్ చేయాలి.
ఇలా రిస్ట్రిక్టిడ్ మోడ్‌ను క్లిక్ చేయడం ద్వారా మీకు అవసరమైన కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. నో ఫిల్టర్ ఇజ్ 100 పర్సెంట్ ఆప్షన్ వాడడం వల్ల మనకు మరింత మెరుగైన పేరెంటల్ కంట్రోల్ లభిస్తుంది. అయితే ఈ ఆప్షన్ అన్ని డివైజ్‌లలో ఉండకపోవచ్చు.
నెట్‌ఫ్లిక్స్‌లో పేరెంటల్ కంట్రోల్ ఇలా...
1.నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి
2. మీరు ఏ ప్రొఫైల్‌ను నియంత్రించాలని అనుకుంటున్నారో ఆ ప్రొఫైల్‌పై ట్యాప్ చేయాలి
3. ఆ తర్వాత వ్యూయింగ్ రిస్ట్రిక్షన్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
4. వయసు విభాగాల వారీగా స్లెడర్‌ని సెట్ చేసుకోవాలి
5. ఆ తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు.
అలాగే పేరెంటల్ కంట్రోల్ మీకు అవసరం లేకపోతే యూజర్లు మళ్లీ ఇదే సెక్షన్‌కు వెళ్లి రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే వారి అకౌంట్‌ను పిన్ చేయడం ద్వారా పిల్లలు అడల్ట్ కంటెంట్‌ను యాక్సెస్ చేయకుండా నియంత్రించొచ్చు.
నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్‌లో పాస్‌వర్డ్ ఇలా పెట్టండి
1. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత అకౌంట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి