• తాజా వార్తలు

రెడ్‌మీ ఫోన్లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి  మూవ్ చేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

షియోమి.. బ్రాండ్ చైనాదే అయినా ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో దీనిదే హ‌వా. షియోమితోపాటు అందులో ఒక బ్రాండ్ అయిన రెడ్‌మీ ఫోన్లు ఇండియాలో బాగా అమ్ముడుపోతున్నాయి. శాంసంగ్‌ను కూడా దాటేసి ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హ‌య్య‌స్ట్ షేర్ ద‌క్కించుకున్న షియోమి ఫోన్లు అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లో కూడా ఉండే మోడ‌ల్స్‌లో కూడా ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం.  అయితే 2జీబీ, 3జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్ల‌లో ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ కూడా 16జీబీ, 32 జీబీకి మించి ఉండ‌దు.  మ‌రోవైపు స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల కోసం ఆండ్రాయిడ్ కుప్ప‌లు తెప్ప‌లుగా యాప్స్ తెచ్చేస్తోంది.  ఒక్కోటీ ఒక్కో సూప‌ర్ ఫీచ‌ర్‌తో వ‌చ్చేస్తుంటే ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ చేసేస్తున్నాం. కానీ అది ఫోన్‌ను స్లో చేసేస్తుంది. మెమ‌రీ కూడా చాల‌దు. అందుకే ఈ యాప్స్‌ను మీ ఎస్‌డీ (మెమ‌రీ) కార్డ్‌లోకి మూవ్ చేసుకోవ‌చ్చు.  అప్పుడు మెమ‌రీ ఫ్రీ అవుతుంది. ర్యామ్ మీద బ‌ర్డెన్ త‌గ్గుతుంది కాబ‌ట్టి ఫోన్ కూడా స్పీడ్ అవుతుంది. 

రెడ్‌మీ ఫోన్ల‌లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి ఎలా మూవ్ చేయాలంటే.. 

1. మీ రెడ్‌మీ ఫోన్‌లో Settings ఆప్ష‌న్ క్లిక్ చేయండి. 

2. స్క్రోల్ డౌన్ చేసి Apps ఆప్ష‌న్ మీద క్లిక్ చేయండి. 

3. ఇప్పుడు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్ లిస్ట్  క‌నిపిస్తుంది.  ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయాల‌నుకున్న యాప్‌ను సెలెక్ట్ చేసుకోండి.

4. త‌ర్వాత స్క్రీన్‌కి కుడి వైపున మ‌ధ్య‌లో ఉన్న Change బ‌ట‌న్‌ను క్లిక్ చేయండి. 

5.ఇప్పుడు మీ యాప్‌ను ఫోన్ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ నుంచి ఎస్డీ కార్డ్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు.

6. ఎస్డీ కార్డ్‌లో ఉన్న యాప్‌ను ఫోన్ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌లోకి పంపించాల‌న్నా ఇదే ప‌ద్ధ‌తి. 

7. అయితే ఎక్కువ యాప్స్‌ను మీరు ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయాల‌నుకున్నా ఒకేసారి మ‌ల్టిపుల్ సెలెక్ష‌న్ ఆప్ష‌న్ లేదు.  కాబ‌ట్టి ఒక్కొక్క యాప్‌ను సెలెక్ట్ చేసి ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయాల్సిందే. 

క్లాస్ 10 ఎస్డీ కార్డ్ ఉంటే.. 
ఎస్డీ కార్డ్‌లోకి యాప్స్ మూవ్ చేయ‌డం స్పీడ్‌గా కావాలంటే క్లాస్‌10, ఆ పైన ఉన్న ఎస్డీ కార్డ్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడొస్తున్న మెమ‌రీ కార్డుల‌న్నీ ఇలాంటివే ఉంటున్నాయి. పాత మెమ‌రీ కార్డ్‌ల బదులు దీన్ని వాడుకుంటే రిజ‌ల్ట్ బాగుంటుంది. 
 

జన రంజకమైన వార్తలు