షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు, పేటీఎం నుంచి ఫోన్ పే దాకా వందల కొద్దీ యాప్స్. ఎలాగూ ఫ్రీయే కాబట్టి విచ్చలవిడిగా డౌన్‌లోడ్ చేసేస్తాం. ఆ తర్వాత ఫోన్ స్లో అయిపోతుంది. పోనీ యాప్ తీసేద్దామంటే మనసొప్పదు. మరేం చేయాలి యాప్స్ క్లియర్ చేయకపోతే ఫోన్ స్పీడవదు. 16 జీబీ, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (రామ్) ఉన్న ఫోన్లలో అయితే ఇలా యాప్స్ పెరిగే కొద్దీ మెమరీ కూడా చాలదు. దీనికి మన చేతిలో ఉన్న పరిష్కారం యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయడమే. ఇండియాలో ఎక్కువ మంది వాడే శాంసంగ్ ఫోన్లలో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి ఎలా మూవ్ చేయాలో చూద్దాం.
ఇదిగో ఇదీ ప్రొసీజర్
1. మీ శాంసంగ్ ఫోన్‌లో Settings ఆప్షన్ క్లిక్ చేయండి.
2. స్క్రోల్ డౌన్ చేసి Apps ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీ శాంసంగ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్ లిస్ట్ స్క్రీన్ మీద వస్తుంది.
4. మీరు ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయాలనుకున్న యాప్‌ను సెలెక్ట్ చేసుకోండి.
5. సెలెక్షన్ కాగానే స్క్రీన్‌కి కుడి వైపున మధ్యలో ఉన్న Change బటన్‌ను క్లిక్ చేయండి.
6.ఇప్పుడు మీ యాప్‌ను ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఎస్డీ కార్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
7. అలాగే ఎస్డీ కార్డ్‌లో ఉన్న యాప్‌ను ఇంటర్నల్ స్టోరేజ్‌లోకి పంపించాలన్నా ఇదే పద్ధతిని ఫాలో కావాలి.
8. అయితే ఎక్కువ యాప్స్‌ను మీరు ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయాలనుకున్నా ఒకేసారి మల్టిపుల్ సెలెక్షన్ ఆప్షన్ లేదు. కాబట్టి ఒక్కొక్క యాప్‌ను సెలెక్ట్ చేసి ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయాల్సిందే.
మంచి ఎస్డీ కార్డ్ ఉంటే బెటర్
ఇలా యాప్స్ ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయడం స్పీడ్‌గా కావాలంటే క్లాస్10, ఆ పైన ఉన్న ఎస్డీ కార్డ్‌ను ఎంచుకోవాలి. అంటే ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందట వచ్చిన కార్డ్‌లు కాకుండా కాస్త లేటెస్ట్‌వి ఎంచుకోవడం మేలు.
ఎస్డీ కార్డ్‌ను ఇంటర్నల్ స్టోరేజ్‌గా కూడా వాడొచ్చు
ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఓఎస్ మీ ఫోన్‌లో ఉంటే ఇలా యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేసుకునే పని కూడా లేదు. మీ ఎస్డీ కార్డ్‌ను ఫార్మాట్ చేసి అదనపు ఇంటర్నల్ మెమరీగా కూడా వాడుకోవచ్చు.