మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ అయినట్లు మీకు ఎలా తెలుస్తుంది? వెంటనే మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చేస్తుంది కదా. అలాకాకుండా మీ అకౌంట్లో డబ్బులు పడగానే మీ ఫోన్‌కు కాల్ వచ్చేలా కూడా అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. ఐఎఫ్‌టీటీటీ యాప్ ద్వారా వచ్చే VoIP Callతో ఇది సాధ్యమవుతుంది.
ఎలా చేయాలంటే..
1. మీ ఫోన్‌లో IFTTT యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ను ఓపెన్ చేసి మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. ఇప్పటికే మీకు అకౌంట్ ఉంటే దానిలోకి లాగిన్ అవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ కాగానే ఫోన్ కాల్ అలర్ట్ రావాలంటే మీరు ఒక యాప్‌లెట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇందుకోసం యాప్ హోం స్క్రీన్‌లో కింద కనిపించే My Applets ట్యాబ్‌ను సెలెక్ట్ చేయాలి. అక్కడ కనిపించే + బటన్‌ను నొక్కి కొత్త ఐఎఫ్‌టీటీటీ యాప్‌లెట్‌ను క్రియేట్ చేసుకోండి.
2. యాప్‌లెట్ క్రియేట్ చేసుకోవడాని ముందుగా యాప్‌లెట్ ట్రిగ్గర్‌ను సెట్ చేసుకోవాలి. Android SMSఅనే యాప్‌లెట్ ఛానల్‌ను సెలెక్ట్ చేయాలి.
3. ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్లో మనీ వేయగానే ఎస్ఎంఎస్‌లో ఏమి వస్తుందో దానికి సంబంధించిన ఓ కీవర్డ్‌ను క్రియేట్ చేయండి. ఉదాహరణకు మీకు వచ్చే మెసేజ్‌లో deposited అని ఉంటుందనుకోండి. దాన్నే ఎంటర్ చేయండి. credited అని వస్తే దాన్నే ఎంటర్ చేయండి.
4. ట్రిగ్గర్ సెట్ చేశాక VoIP Calls అని కనిపించే యాక్షన్ ఛానల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత Call my device అనే దాన్ని మీ మెయిన్ యాప్‌లెట్ యాక్షన్‌గా సెలెక్ట్ చేసుకోవాలి.
5. డబ్బులు మీ అకౌంట్‌లో జమ కాగానే మీకు ఫోన్ కాల్ వస్తే అందులో విషయం వివరించడానికి వీలుగా వాయిస్ మెసేజ్‌ను సెట్ చేసుకోవాలి. అంటే మీకు కాల్ రాగానే లిఫ్ట్ చేస్తే ఆ వాయిస్ మెసేజే వినిపిస్తుంది. మెసేజ్ పంపిన పర్సన్ నేమ్ అంటే బ్యాంక్ నేమ్, ఎస్ఎంఎస్ టెక్స్ట్ మీరే ఎంటర్ చేయాలి. ఇవన్నీ చేశాక Create Action బటన్ నొక్కాలి.
6. ట్రిగ్గర్, యాక్షన్ ఛానల్ రెండూ సెట్‌చేశారు. ఇప్పుడు మీరు యాప్‌లెట్‌ను అనేబుల్ చేసి సేవ్ చేయాలి. అంటే మీ అకౌంట్‌లో మనీ పడగానే మీకు ఆ బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది కదా. దాన్నే సెండర్ పేరు దగ్గర మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి. అదే పేరుతో అదే కీవర్డ్‌తో మెసేజ్ రాగానే మీకు కాల్ వస్తుంది.