మీ బ్యాంక్ అకౌంట్‌లో నుంచి రూపాయి విత్ డ్రా అయినా కూడా మీ ఫోన్‌కు క్షణాల్లో మెసేజ్ వచ్చేస్తుంది. మీకు తెలియకుండా ఎవరైనా మీ అకౌంట్లో నుంచి విత్‌డ్రా చేసుకున్నా వెంటనే మీకు తెలియపరచడానికే బ్యాంకులు ఏర్పాట్లు చేశాయి. వాట్సాప్‌తో ఈజీ కమ్యూనికేషన్ వచ్చేశాక ఎస్ఎంఎస్‌ల వాడకం బాగా తగ్గిపోయింది. చాలామంది మెసేజ్‌లను రెండు, మూడు నెలలకోసారి కూడా చూడడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో మీకు తెలియకుండానే అకౌంట్‌లో నుంచి మనీ విత్‌డ్రా అయిపోయిందనుకోండి. మెసేజ్ వచ్చినా మీరు గమనించకపోతే తర్వాత లబోదిబోమన్నా లాభం లేదు. అందుకే మీ అకౌంట్లో నుంచి మనీ విత్‌డ్రా కాగానే వెంటనే మీ ఫోన్‌కు కాల్ వచ్చేలా కూడా అలర్ట్ సెట్ చేసుకోవచ్చు.
ఎలా చేయాలంటే..
1. మీ ఫోన్‌లో IFTTT యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ను ఓపెన్ చేసి మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ విత్‌డ్రా కాగానే ఫోన్ కాల్ అలర్ట్ రావాలంటే మీరు ఒక యాప్‌లెట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
2. ఇందుకోసం ముందుగా యాప్‌లెట్ ట్రిగ్గర్‌ను సెట్ చేసుకోవాలి. Android SMSఅనే యాప్‌లెట్ ఛానల్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత New SMS received matches search అనే యాప్‌లెట్ ట్రిగ్గర్‌ను సెట్ చేసుకోండి.
3. ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్‌లో మనీ తీయగానే ఎస్ఎంఎస్‌లో ఏమి వస్తుందో దానికి సంబంధించిన ఓ కీవర్డ్‌ను క్రియేట్ చేయండి. ఉదాహరణకు మీకు వచ్చే మెసేజ్‌లో withdrawn అని ఉంటుందనుకోండి. దాన్నే ఎంటర్ చేయండి. Debited అని వస్తే దాన్నే ఎంటర్ చేయండి.
4. ట్రిగ్గర్ సెట్ చేశాక VoIP Calls అని కనిపించే యాక్షన్ ఛానల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత Call my device అనే దాన్ని మీ మెయిన్ యాప్‌లెట్ యాక్షన్‌గా సెలెక్ట్ చేసుకోవాలి.
5. మనీ విత్‌డ్రా కాగానే మీకు ఫోన్ కాల్ వస్తే అందులో విషయం వివరించడానికి వీలుగా వాయిస్ మెసేజ్‌ను సెట్ చేసుకోవాలి. అంటే మీకు కాల్ రాగానే లిఫ్ట్ చేస్తే ఆ వాయిస్ మెసేజే వినిపిస్తుంది. మెసేజ్ పంపిన పర్సన్ నేమ్ అంటే బ్యాంక్ నేమ్, ఎస్ఎంఎస్ టెక్స్ట్ మీరే ఎంటర్ చేయాలి.
6. ట్రిగ్గర్, యాక్షన్ ఛానల్ రెండూ సెట్ చేశారు. ఇప్పుడు మీరు యాప్‌లెట్‌ను అనేబుల్ చేసి సేవ్ చేయాలి. అంటే మీ అకౌంట్‌లో నుంచియ మనీ తీయగానే మీకు ఆ బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది కదా. దాన్నే సెండర్ పేరు దగ్గర మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి. అదే పేరుతో అదే కీవర్డ్‌తో మెసేజ్ రాగానే మీకు కాల్ వస్తుంది.