పేరుమీద గూగుల్ సెర్చ్ కొడితే ఇన్ఫర్మేషన్ వచ్చేంత స్థాయి మీకు ఉందా? అలా ఉంటే కూడా చాలామందికి సమస్యే. ప్రతి చిన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. ప్రైవసీ అనేది ఉండనే ఉండుద. అందుకే ఇలాంటివారికోసం right to be forgotten అనే కొత్త ఫీచర్ వచ్చింది. యూరోపియన్ యూనియన్ లోని దాదాపు 32 దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా వ్యక్తులు ఎవరైనా సరే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లను వాటిలో తమ పేరు మీద సెర్చ్ చేసినా ఎలాంటి వివరాలు రాకుండా రిమూవ్ చేయమని అడగొచ్చు. అయితే ఈయూ నిర్ణయంపై గూగుల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
32 దేశాలకే పరిమితం
ఈ నిబంధన యూరోపియన్ యూనియన్ దేశాల్లో మాత్రమే పరిమితం. అంటే Google.fr , Google.deలాంటి సెర్చ్‌ల్లో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే ఆ వ్యక్తుల పేరుమీద ఉన్న వెబ్‌పేజీలు ఎక్కడికీ పోవు. కేవలం యూరోపియన్ యూనియన్ దేశాల్లోని యూజర్లు మాత్రం వాటిని యాక్సెస్ చేయలేరు. యూరోపియన్ యూనియన్‌లోని 22 దేశాలతోపాటు నార్వే, స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, లుచ్‌చెన్‌స్టైన్ దేశాల్లోనూ ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ దేశాల్లో 90 శాతానికి పైగా ఆన్‌లైన్ సెర్చ్ గూగుల్‌లోనే జరుగుతుంది. ఈ కొత్త నిబంధనతో చిక్కేనంటోంది గూగుల్.
రైట్ టు బి ఫర్‌గాటెన్‌ను ఎలా వాడుకోవాలి?
1. గూగుల్ అఫీషియల్ ఫామ్‌లోకి వెళితే ఇంగ్లీష్ వెర్షన్లో ఫాం ఉంటుంది. ఫ్రెంచ్‌తోపాటు ఇతర లాంగ్వేజ్‌ల్లో కూడా ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు.
2. మీరు నివసిస్తున్న దేశాన్నిఅక్కడున్న లిస్ట్‌లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మీ రిక్వెస్ట్ ఓకే అయితే మీ పేరు ఆ లిస్ట్‌లో ఉన్న 32 దేశాల్లోనూ గూగుల్ సెర్చ్‌లో కనపడదు.
3. పేరు, ఈమెయిల్ అడ్రస్ వంటి పర్సనల్ డిటెయిల్స్ నింపాలి.
4. సెర్చ్ రిజల్ట్ నుంచి మీరు రిమూవ్ చేయాలనుకుంటున్న పేజీల యూఆర్ఎల్స్ ఎంటర్ చేయండి. Add additional బటన్ నొక్కి మరిన్ని యూఆర్ ఎల్స్ ఎంటర్ చేయొచ్చు.
5. ఎందుకు సెర్చ్‌లో నుంచి మీ పేజీలు రిమూవ్ చేయాలనుకుంటున్నారో కారణాన్ని రాయాలి.
6. మీ ఐడెంటిఫికేషన్‌కు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటి ఏదైనా ఒక ప్రూఫ్ ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయాలి.
7. సిగ్నేచర్ రాసి సబ్మిట్ బటన్ నొక్కితే మీ రిక్వెస్ట్ పూర్తవుతుంది.
మీ రిక్వెస్ట్ అంగీకారం పొందితే మీ మెయిల్ ఐడీకి మెయిల్ వస్తుంది.