• తాజా వార్తలు

ఎమ‌ర్జెన్సీ సిట్యుయేష‌న్స్‌లో ఫోన్‌ని కాల్స్‌, లొకేష‌న్ మాత్ర‌మే ప‌నిచేసేలా చేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే టైమే తెలియ‌దు. వాట్సాప్ చాటింగ్‌లు, ఫేస్‌బుక్ పోస్టింగ్‌లు, మెసెంజ‌ర్లు, కాల్స్‌, గేమ్స్ ఇలా ఏదో ఒక‌దాన్ని చూసుకుంటూ గంట‌లు నిముషాల్లా గ‌డిచిపోతాయి. కానీ ఇది మ‌న టైమ్‌ను ఎంత వేస్ట్ చేస్తుందో మ‌నం గుర్తించ‌డం లేదు. అందుకే ఫోన్ మీ టైమంతా తినేయ‌కుండా కేవలం ఫోన్ కాల్స్‌, ఏదైనా లొకేష‌న్‌కు వెళుతుంటే డైరెక్ష‌న్స్ మాత్ర‌మే ప‌ని చేసేలా సెట్ చేసుకోవ‌చ్చు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మీ ఫోన్ బ్యాట‌రీ అయిపోతున్న‌ప్పుడు కూడా ఈ సెట‌ప్ వ‌ల్ల ఫోన్‌ను ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచుకోవ‌డం సాధ్య‌మవుతుంది.  దీనికి ఏం చేయాలంటే..

నో ఫోన్ లాంచ‌ర్‌
నో ఫోన్ లాంచ‌ర్ పేరుతో ఆండ్రాయిడ్ యాప్ ఉంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ ఫోన్‌తో ఫోన్ కాల్స్ చేస‌కోవ‌డం, గూగుల్ మ్యాప్స్‌లో డైరెక్ష‌న్ చూడ‌డం మాత్ర‌మే చేయ‌గ‌లుగుతారు. అంటే ఫోన్లో ఉన్న మిగిలిన ఫీచ‌ర్లు, యాప్స్ అన్నీ తాత్కాలికంగా బ్లాక్ అవుతాయ‌న్న‌మాట‌. 

1. ప్లే స్టోర్‌లోకి వెళ్లి NoPhone యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

2. యాప్ ఓపెన్ చేసి దాన్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్ హోమ్ స్క్రీన్‌గా సెట్ చేయండి. ఇందుకోసం ఫోన్ హోం బ‌ట‌న్ నొక్కి NoPhone యాప్‌ను సెలెక్ట్ చేయండి.

3. ఇప్పుడు వైట్ క‌ల‌ర్ స్క్రీన్ మీద Tasks, Call, and Directions అనే మూడు ఆప్ష‌న్లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. Tasksలో మీరు షెడ్యూల్ యాడ్ చేసుకోవ‌చ్చు. కాల్స్ ఆప్ష‌న్ క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని పేర్లు క‌నిపిస్తాయి. వాళ్ల ఫోటో నెంబ‌ర్ ఏమీ కూడా క‌న‌ప‌డ‌వు. ఇక డైరెక్ష‌న్స్ క్లిక్ చేస్తే గూగుల్ లొకేష‌న్ క‌నిపిస్తుంది. చివ‌రిలో సెట్టింగ్స్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లొచ్చు. 

4. అంటే మీ స్మార్ట్‌ఫోన్ సింపుల్‌గా ఫీచ‌ర్ ఫోన్‌లా మార్చేసుకున్నారు. అన‌వ‌స‌ర‌మైన యాప్స్‌, సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో మీ టైమంతా వేస్ట‌వుతుంద‌నుకుంటే మ‌న‌శ్శాంతిగా ఉండ‌డానికి ఈ నో ఫోన్ లాంచ‌ర్ యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

5. ఏ ర‌క‌మైన స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోవ‌డం, యాప్స్‌, ఫోన్ విడ్జెట్స్ యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో బ్యాట‌రీ యూసేజ్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది.  కాబట్టి మ‌న ఫోన్లో ఛార్జింగ్ త‌క్కువ ఉండి, వెంట‌నే ఛార్జి చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఈ నో ఫోన్ యాప్‌ను హోం స్క్రీన్‌గా మార్చుకుంటే ఫోన్ ఎక్కువ‌సేపు ఆన్‌లో ఉంచుకోగ‌లుగుతాం. 

 

జన రంజకమైన వార్తలు