మీ యొక్క పర్మినేంట్ ఎకౌంటు నెంబర్ ( పాన్ ) మరియు ఆదార్ లలో మీ వివరాలలో ఉండే తప్పులను సరిచేసుకోవడానికి ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు ఒక ఆన్ లైన్ ఫెసిలిటీ ని లాంచ్ చేసింది. మీ పాన్ ను బయో మెట్రిక్ ఐడెంటిఫయర్ అయిన ఆదార్ తో లింక్ చేయడానికి ఈ డిపార్టుమెంటు తన ఈ -ఫిల్లింగ్ వెబ్ సైట్ లో రెండు సపరేట్ హైపర్ లింక్ లను ఉంచింది.
వీటిలో మొదటిది- ఇండియన్ లేదా ఫారిన్ సిటిజెన్ యొక్క పాన్ ఎకౌంటు లో ఏవైనా తప్పులు ఉంటె సరిచేసుకోవడానికి మరియు కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి. ఇక రెండవ హైపర్ లింక్ ఎవరైతే తమ ఆదార్ లో ఉన్న వివరాలను అప్ డేట్ చేసుకోవాలి అనుకుంటారో వారికోసం. వారి ఈ లింక్ ద్వారా తమ యొక్క యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ను ఉపయోగించి ఆదార్ సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ లోనికి లాగ్ ఇన్ అవ్వవచ్చు. ఆ తర్వాత తమ యొక్క స్కాన్న్ద్ డాక్యుమెంట్ లను ప్రూఫ్ గా అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1.22 కోట్ల మందికి పైగా తమ పాన్ నెంబర్ తో ఆదార్ ను లింక్ చేసుకున్నారు. అయితే 25 కోట్ల మంది పాన్ వినియోగదారులతో పోల్చితే ఇది చాలా తక్కువ. అలాగే 111 కోట్ల మందికి ఇష్యూ చేసిన ఆదార్ తో పోల్చినా సరే పాన్ ఎకౌంటు ల సంఖ్య తక్కువే కదా! అందుకే భారత ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు ఈ సర్వీస్ ను లాంచ్ చేసింది. ఇది చెబుతున్న దాని ప్రకారం ఇప్పటివరకూ 6 కోట్ల మంది మాత్రమే ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు.
భారత్ ఆర్థిక మంత్రి అయిన శ్రీ అరుణ్ జైట్లీ 2017-18 ఫైనాన్సు బిల్ కు చేసిన సవరణ ద్వారా ఇన్ కం టాక్స్ రిటర్న్స్ కు ఆదార్ ను తప్పనిసరిచేశారు. ఈ నేపథ్యం లోనే గత వారం భారత ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు ఈ ఆదార్ మరియు పాన్ లలో తప్పులు సరిచేసుకోవడానికి ఆన్ లైన్ ఫెసిలిటీ ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పాన్ కార్డు తీసుకునే వారి పేరు వారి యొక్క ఆదార్ నెంబర్ లో ఉన్న ప్రకారం ఉండాలి. దానిప్రకారం సరిగా ఉంటే సరే సరి లేకపోతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది. దీనిని ఉపయోగించి మీరు మార్పులు చేసుకోవచ్చు.