• తాజా వార్తలు

యాప్ స్టోర్‌లో అందుబాటులో లేని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

 ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే వేల కొద్దీ యాప్స్‌. ఏది ఎంచుకోవాలో తెలియ‌న‌న్ని యాప్స్. కానీ కొన్ని యాప్స్‌ను డెవ‌ల‌ప‌ర్స్ కొన్నాళ్లు  ప్లే స్టోర్‌లో ఉంచి ఆ త‌ర్వాత తీసేస్తారు. యాప్ వ‌ల్ల పెద్ద‌గా ఆదాయం లేక‌పోయినా లేదంటే దాన్ని త‌ర్వాత త‌ర్వాత డెవ‌ల‌ప్ చేసి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇవ్వ‌డానికి ఇంట్రెస్ట్ లేక‌పోవ‌డం, దానికి ఫైనాన్స్ చేసే కెపాసిటీ లేక‌పోవడం ఇలా కార‌ణాలేమైనా గానీ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసేస్తారు. అప్ప‌టికే మీరు ఆ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే  అది మీ ఫోన్‌లో నుంచి కూడా రిమూవ్ అయిపోతుంది. అలాంఇ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి కూడా చాలా సింపుల్ ట్రిక్ ఉంది. 

గేమ్స్ యాప్స్ ఎక్కువ‌గా తొల‌గిస్తారు
ముఖ్యంగా గేమ్స్ యాప్స్ ఇలా ఎక్కువ‌గా ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేస్తుంటారు. గేమ్‌లో కొత్త వెర్ష‌న్లు వ‌స్తుంటే పాత‌వాటికి డిమాండ్ ఉండ‌దు. అందుకే వాటిని డెవ‌ల‌ప‌ర్లు రిమూవ్ చేసేస్తుంటారు. డిసెంబ‌ర్‌లో ఎపిక్ బ్లేడ్ గేమ్‌ను అలాగే రిమూవ్ చేశారు. 

ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఎలా చేయాలంటే
1. మీ గూగుల్ అకౌంట్‌తో ప్లే స్టోర్‌ను ఓపెన్ చేయండి. ఇంత‌కుముందు మీరు ఆ యాప్ వాడిన‌ప్పుడు ఇదే గూగుల్ అకౌంట్ నుంచి దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉండాల‌న్న సంగతి మ‌రిచిపోకండి.

2. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఎడ‌మ‌వైపు టాప్‌లో త్రీ డాటెడ్ బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే  మై యాప్స్ అండ్ గేమ్స్ ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేయండి. 

3. ఈ ప్యానల్‌లో అప్‌డేట్స్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. మీ ఫోన్‌లో ఉన్న‌యాప్స్‌కి అప్‌డేట్స్ ఉంటే వాట‌న్నింటినీ చూపిస్తుంది.  త‌ర్వాత మూడో ట్యాబ్‌ లైబ్ర‌రీ అని ఉంటుంది.

4. లైబ్ర‌రీ ట్యాబ్‌ను క్లిక్ చేస్తే మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న లేదా ప‌ర్చేజ్ చేసిన అన్ని యాప్స్ క‌నిపిస్తాయి. వాటిలో ఏదైనా యాప్ ప్లేస్టోర్‌లో ప్ర‌స్తుతం అందుబాటులో లేక‌పోయినా స‌రే లైబ్ర‌రీ ట్యాబ్‌లో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది.

5. ఇప్పుడు మీరు గ‌తంలో డౌన్‌లోడ్ చేసుక‌ని ఇప్పుడు ప్లేస్టోర్‌లో రిమూవ్ అయిన యాప్ ఉన్నా ఇక్క‌డ కనిపిస్తుంది. దాని ప‌క్క‌నున్న ఇన్‌స్టాల్ బ‌ట‌న్ నొక్కితే ఆ యాప్ మ‌ళ్లీ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది.

ఐవోఎస్ యాప్ స్టోర్‌లో 
ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లాగానే కొన్ని యాప్స్ ఐవోఎస్ యాప్ స్టోర్ నుంచి కూడా డెవ‌ల‌ప‌ర్స్ రిమూవ్ చేస్తుంటారు. అలాంటి వాటిని కూడా మీరు గ‌తంలో ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే తిరిగి రీ ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

1. మీ యాపిల్ ఐడీతో ఐవోఎస్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేయండి. ఇంత‌కుముందు మీరు ఆ యాప్ వాడిన‌ప్పుడు ఇదే యాపిల్ ఐడీ నుంచి దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలి.

2. ఐఫోన్‌లేదా ఐ ప్యాడ్‌లో యాపిల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పిక్చ‌ర్ మీద టాప్ చేయండి.

3. త‌ర్వాత విండోలో ప‌ర్చేజ్డ్ ఆప్ష‌న్‌ను టాప్ చేయండి.  ఇందులో మీరు ఐవోఎస్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ అన్నీ క‌నిపిస్తాయి.

4. త‌ర్వాత ఉన్న ఐఫోన్ ట్యాబ్‌ను క్లిక్ చేస్తే ఆ యాపిల్ ఐడీతో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ అన్నీ క‌నిపిస్తాయి.  ఆ యాప్ ఐవోఎస్ స్టోర్ నుంచి రిమూవ్ అయినా కూడా అక్క‌డ క‌నిపిస్తుంది. 

5. ఇప్పుడు మీరు గ‌తంలో డౌన్‌లోడ్ చేసుక‌ని ఇప్పుడు ప్లేస్టోర్‌లో రిమూవ్ అయిన యాప్‌ను ప‌క్క‌నున్న ఇన్‌స్టాల్‌ బ‌ట‌న్ నొక్కితే ఆ యాప్ మ‌ళ్లీ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది.
 

జన రంజకమైన వార్తలు