దీపావళి హంగామా వచ్చేసింది. ధన్‌తేరాస్ నుంచే ధనాధన్ మొదలయిపోయింది. ఒకప్పుడు ఫోన్ కాల్స్ చేసి దసరా శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. దాని ప్లేస్‌లో ఎస్ఎంఎస్‌ల హవా నడిచింది కొన్నాళ్లు. వాట్సాప్ వచ్చాక అవన్నీ మర్చిపోండి.. అన్నట్లు అన్నింటినీ అదే ఆక్రమించేసింది. అందరికీ అందుబాటులో ఉన్న వాట్సాప్‌లో దీపావళి గ్రీటింగ్స్ పంపడానికి ప్లే స్టోర్‌లో స్పెషల్ స్టిక్కర్స్ కూడా రెడీ అయిపోయాయి. వాటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? మీ బంధుమిత్రులకు పంపడానికి ఏం చేయాలో సింపుల్‌గా చూద్దాం రండి..
ఏమేం కావాలి?
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ యాప్ అప్‌డేట్ చేసుకోండి. మొబైల్ డేటా లేదా వైఫై ఆన్ చేసుకుని ఉంచుకోండి.
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
1. వాట్సాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన పర్సన్ లేదా గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోండి
2. చాట్‌లో కింద ఉన్న ఎమోజీ బటన్‌ను క్లిక్ చేయండి.
3. ఇప్పుడు స్టిక్కర్స్ సెక్షన్‌లో ఉన్న చివర ఉన్న + గుర్తును క్లిక్ చేయండి
4. కిందికి స్క్రోల్ డౌన్ చేసి Get more Stickers పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళతారు. ఇక్కడ మీరు ధన్‌తేరాస్, దివాళీ స్టిక్కర్స్ సెర్చ్ చేసుకోవచ్చు.
6. నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి.
7. దాన్ని ఓపెన్ చేసి మీ వాట్సాప్‌కు యాడ్ చేసుకోండి.
8. ఇప్పుడు మీకు కావాల్సిన కాంటాక్ట్ లేదా గ్రూప్‌కు వెళ్లి చాట్ ఓపెన్ చేసి కింద యాడ్ చేసి ఉన్న స్టిక్కర్స్‌లో నుంచి మీకు నచ్చిన స్టిక్కర్‌ను వారికి సెండ్ చేసి హ్యాపీ దీపావళి చెప్పేయండి.
ఆండ్రాయిడ్‌కు మాత్రమే
ప్లే స్టోర్‌లోని ఈ స్టిక్కర్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఐ ఫోన్ యూజర్లకు కావాలంటే ఐవోఎస్ స్టోర్‌కు వెళ్లాల్సిందే.