మీరు యాప్ లను బాగా ఉపయోగిస్తారా? ఏ యాప్ నైనా అందరికంటే ముందే మీరే టెస్ట్ చేయాలి లేదా ఉపయోగించాలి అనుకుంటారా? అయితే మీ లాంటి వారికోసమే ఈ ఆర్టికల్. ఇంకా రిలీజ్ అవ్వని ఆండ్రాయిడ్ యాప్ లను ముందే ఎలా యాక్సెస్ చేయాలో ఇక్కడ ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.
ప్లే స్టోర్ లో వీటిని ముందుగానే యాక్సెస్ చేయడం ఎలా?
1. ప్లే స్టోర్ యొక్క హోం పేజి ను ఓపెన్ చేయాలి. చార్ట్స్, గేమ్స్, కేటగరీస్ లాంటి ట్యాబ్ లు మీకు కనిపిస్తాయి.
2. వాటిపై కుడి వైపుకి స్వైప్ చేస్తే ఎర్లీ యాక్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి.
3. ఎర్లీ యాక్సెస్ మిమ్మల్ని కొత్త విండో కి తీసుకెళ్తుంది.అది ప్లే స్టోర్ యాప్ లోనే ఇన్ స్టాల్ చేసుకుని మరియు టెస్ట్ చేసుకునే ఆప్షన్ ను ఇస్తుంది.
4. ఇక్కడ ఇప్పటివరకూ రిలీజ్ అవ్వని యాప్ లు మరియు డెవలప్ మెంట్ లో ఉన్న గేమ్స్ కనిపిస్తాయి.
5. అయితే చాలా తక్కువ మొత్తం లో మాత్రమే ఈ యాప్ లు మీకు కనిపిస్తాయి. వీటితో పాటు “దిస్ యాప్ ఈజ్ ఇన్ డెవలప్ మెంట్, ఇట్ మే బి అన్ స్టేబుల్ “ అనే ఒక సూచన కూడా కనిపిస్తుంది.
6. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్లే స్టోర్ లో రిలీజ్ అయిన యాప్ లతో పోల్చి చూసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
7. వినియోగదారుల ఫీడ్ బ్యాక్ కోసం కూడా ఈ యాప్ లను ప్లే స్టోర్ లో ఉంచుతారు.
చూశారుగా, ఇప్పటివరకూ రిలీజ్ అవ్వని యాప్ లను యాక్సెస్ చేసి మొదట టెస్ట్ చేసిన ఆనందం పొందాలి అనుకుంటున్నారా ? మరి ఎందుకు ఆలస్యం, వెంటనే పైన చెప్పిన విధానం లో వాటిని ఇన్ స్టాల్ చేసుకోండి.