• తాజా వార్తలు

మీ ఫేస్‌బుక్ పోస్ట్‌ను లైక్ చేసిన వారిని మీ ఎఫ్‌బీ పేజీని కూడా లైక్ చేసేలా చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీకో ఫేస్‌బుక్ పేజీ ఉంది. దాన్ని మీ ఫ్రెండ్స్ అంద‌రికీ తెలిసేలా, వాళ్లు లైక్ చేసేలా చేయాల‌నుకుంటున్నారు. ముఖ్యంగా మీ ఫేస్‌బుక్ యాక్టివ్ ఫ్రెండ్స్  మీరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే లైక్ కొట్టేవాళ్ల‌కు మీ ఎఫ్‌బీ పేజీని కూడా లైక్ చేయ‌మ‌ని ఇన్వైట్ చేయ‌వ‌చ్చు. దీనికి మీరుచేయాల్సింద‌ల్లా  invఅనే క్రోమ్ బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్ యాడ్ చేసుకోవ‌డ‌మే. ఈ ఎక్స్‌టెన్ష‌న్ ఎలా ఉప‌యోగించుకోవాలో చూద్దాం.

1. inv అనే క్రోమ్ బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌ను డౌన్‌లోడ్ చేసి మీ బ్రౌజ‌ర్‌కు యాడ్ చేసుకోండి.

2. ఇప్పుడు ఈ ఎక్స్‌టెన్ష‌న్ మీ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో టాప్‌లో inv అనే లోగోతో క‌నిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఓ పాప్ అప్ వ‌స్తుంది. దీనిద్వారా మీరు మీ ఫ్రెండ్స్‌కు మీ ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయ‌మ‌ని  1.8 సెక‌న్ల‌లో ఇన్విటేష‌న్ పంపొచ్చు.ఇది మినిమం టైమ్‌. దీన్ని 9 సెక‌న్ల వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

3. ఇప్పుడు మీరు ఎఫ్‌బీలో చేసిన పోస్ట్‌ను ఓపెన్ చేయండి. లైక్స్ మీద క్లిక్‌చేస్తే మ‌రో పాప్ ఓపెన్ అవుతుంది. అక్క‌డ మీ పోస్ట్‌ను లైక్ చేసిన వారి లిస్ట్ క‌నిపిస్తుంది.

4. ప్ర‌తి యూజ‌ర్‌కు ప‌క్క‌న ఇన్‌వైట్ బ‌ట‌న్ కనిపిస్తుంది. వీటిలో ఒక్కో యూజ‌ర్‌కు ఇన్వైట్ చేయ‌డం కాస్త చిరాకే. ఇక్క‌డే మీకు ఐఎన్‌వీ బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది. పాప్ అప్‌ను ఓపెన్ చేసి  Send invite బ‌ట‌న్ క్లిక్ చేయండి.

5. ఇప్పుడు మ‌రో పాప్ ఓపెన్ అవుతుంది. ఈ ఎక్స్‌టెన్ష‌న్ స్క్రిప్ట్ ప‌నిచేయ‌డం ప్రారంభిస్తుంది. ఒక్కొక్క‌రికి మీ ఇన్విటేష‌న్ పంపిస్తుంది. ఎంత‌మందికి ఇన్విటేష‌న్లు పంపారో నంబ‌ర్ కూడా పైన నెంబ‌ర్ క‌నిపిస్తుంది. ఈఎక్స్‌టెన్ష‌న్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో ప‌నిచేయ‌నివ్వండి. మీరు పంపాల‌నుకున్న‌వారంద‌రికీ ఇన్విటేష‌న్లు పంపేశాక కావాలంటే ఆ ఎక్స్‌టెన్ష‌న్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

రోజుకు 490 మందికి
ఈ ఐఎన్‌వీ ఎక్స్‌టెన్ష‌న్ ఫ్రీ వెర్ష‌న్‌తో మీరు రోజుకు 490 మంది ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు ఇన్విటేష‌న్లు పంపొచ్చు. ఇలా మొత్తం ల‌క్ష మందికి మీరు ఇన్విటేష‌న్లు పంపేందుకు వీలుంటుంది.  ఒక్క‌రోజే 490 మందికంటే ఎక్కువ‌మందికి ఇన్విటేష‌న్లు పంపాలంటే ప్రో ప్లాన్ (పెయిడ్‌) తీసుకోవాలి. అయితే 490అంటే పెద్ద నెంబ‌రే కాబ‌ట్టి ఫ్రీ వెర్ష‌న్ స‌రిపోతుంది.

జన రంజకమైన వార్తలు