పెన్షన్ ఉంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఓ భరోసా. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని ఆన్‌లైన్‌లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఏమేం ఉండాలి?
నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేయాలంటే మీకు ఈ మూడూ ఉండాలి.
మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్న బ్యాంకు అకౌంట్ తప్పనిసరి.
ఆన్‌లైన్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?
1. eNPS website ఓపెన్ చేసి registration బటన్ నొక్కండి.
2 online subscriber registration పేజీ ఓపెన్ అవుతుంది. new registration మీద క్లిక్ చేసి మీ వర్చ్యువల్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి continue బటన్ నొక్కండి.
3. ఇప్పుడు మీ పేరుతో ఓ ఎకనాలెడ్జ్ నెంబర్ జనరేట్ అవుతుంది. OK కొట్టండి.
4. పర్సనల్ డిటెయిల్స్ ఎంటర్ చేసి Save and proceed ఆప్షన్ క్లిక్ చేయండి.
5 . తర్వాత స్టెప్‌లో మీ బ్యాంకింగ్ వివరాలు అడుగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్న మీ బ్యాంకర్ డిటెయిల్స్‌ను ఎంటర్ చేయండి. Save and proceed ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి.
6. ఇప్పుడు మీరు పోర్ట్‌ఫోలియో ఎలొకేషన్ ( అంటే మీ పెన్షన్ స్కీమ్‌లో పెట్టే సొమ్మును ఏ రకంగా పెట్టుబడి పెట్టాలి?) చేయాలి. ఈక్విటీ ఫండ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫండ్, కార్పొరేట్ బాండ్ ఫండ్ ఇలా ఆప్షన్లు ఉంటాయి. వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నా తర్వాత స్టెప్‌లో నామినీ డిటెయిల్స్ అప్‌డేట్ చేయండి.
7. నామినీ వివరాలిచ్చాక, మీ అకౌంట్‌కు సంబంధించిన క్యాన్సిల్డ్ చెక్ కాపీని, మీ ఫొటోను, మీ స్పెసిమన్ సిగ్నేచర్‌ను కూడా అప్‌లోడ్ చేయాలి.
8. ఇవన్నీ పూర్తయ్యాక ఫస్ట్ ఇన్వెస్ట్ మెంట్‌గా కనీసం 500 రూపాయలయినా ఎన్‌పీఎస్ అకౌంట్‌లో వేయాలి.
9. ఈ పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాక పేమెంట్ రసీదుతోపాటు మీ permanent retirement account number (PRAN) కూడా జనరేట్ అవుతుంది.
10. ఇప్పుడు తర్వాత పేజీకి వెళితే e-sign/print registration for పేజీ కనిపిస్తుంది. e-sign with Aadhaarను సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయగానే ఆధార్ అథెంటికేట్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ ఎలక్ట్రానికల్లీ సైన్డ్ అని కన్సిడర్ అవుతుంది.
ఎన్‌పీఎస్‌తో లాభాలు
ఎన్‌పీఎస్‌లో చేరడానికి గరిష్ట వయోపరిమితిని 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. ఎన్‌పీఎస్ టైర్ -1 ఎకౌంట్ ఉంటే సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద 50 వేల వరకు అదనపు ఇన్‌కమ్‌ట్యాక్స్ రిబేట్ పొందవచ్చు. మీ వాటా సొమ్ములో 25% వరకు మధ్యలో కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.