మొబైల్‌లో బ్యాటరీ ఫుల్‌గా ఉండీ, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉండీ.. నెట్‌వర్క్ కవరేజ్ లేకపోతే? ఏం చేయగలం? ఈ నెట్‌వర్క్ ఇంతే అని తిట్టుకుంటాం. అంతకంటే ఏం చేస్తాం అనుకుంటున్నారా? అయితే మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని తిరిగి పొందడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలాసార్లు మీ నెట్‌వర్క్ లేకపోవడం కాదు.. వాటికేవో అంతరాయాలు ఏర్పడడమే మీకు నెట్‌వర్క్ కనెక్ట్ కాకపోవడానికి కారణమవుతాయి. అందుకే ఈ ట్రిక్స్ పాటిస్తే చాలా సందర్భాల్లో మీకు నెట్‌వర్క్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఫోన్ లేదా మొబైల్ కనెక్షన్‌ను రీస్టార్ చేయండి
చాలా సందర్భాల్లో మీ ఫోన్‌లోని ఏంటెన్నా నెట్‌వర్క్‌ను అందుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు మీకు నెట్‌వర్క్ అందకపోవచ్చు. అందుకే ఫోన్‌ను ఏరోప్లేన్‌లో మోడ్‌లో పెట్టి కొన్ని సెకన్ల తర్వాత ఆ మోడ్‌లో నుంచి తీసేయండి. ఇది వర్కవుట్ కాకపోతే ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇది మోడెమ్ రీబూట్ అవడానికి సహకరిస్తుంది.
డేటా రోమింగ్ యాక్టివేట్ చేయండి
డేటా రోమింగ్‌ను యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆప్షన్ వల్ల మీ మొబైల్ ఫోన్ అందులోని సిమ్‌కు బయట ఉన్న యాంటెన్నాలను కూడా కనెక్ట్ చేసుకోగలుగుతుంది. కాబట్టి నెట్‌వర్క్ కవరేజ్ బాగుంటుంది.
ఫోన్ కేస్ తొలగించండి
ఫోన్‌కి నెట్‌వర్క్‌తో కనెక్షన్ ఏర్పాటు చేసే యాంటెన్నాలను మీ ఫోన్ కేస్ పూర్తిగా కవర్ చేసేస్తే కూడా నెట్‌వర్క్ కనెక్ట్ కాకపోవచ్చు. మీకు నెట్‌వర్క్ కనెక్ట్ కాకపోతే ఒక్కసారి మీ ఫోన్ కేసు తొలగించి చూడండి. అప్పుడు నెట్‌వర్క్ బాగుంటే ప్రాబ్లమ్ కేస్‌లో ఉన్నట్లు.
ఏపీఎన్ మోడిఫై చేసుకోండి
మీ ఫోన్‌లో తరచూ నెట్‌వర్క్ ప్రాబ్లం వస్తుంటే ఆపరేటర్‌ను సంప్రదించి యాక్సెస్ పాయింట్ (APN) మోడిఫై చేయించుకోండి. మీ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీ అవుట్‌లెట్‌ను సంప్రదించి ఫామ్ నింపి ఏపీఎన్ మార్చుకోవాలి. లేదంటే ఇంటర్నెట్‌లో మీ మొబైల్ నెట్‌వర్క్ పేరు తర్వాత Configure APN అని టైప్ చేసి బ్రౌజ్ చేస్తే ఈ ఫామ్ వస్తుంది.
మీ ఆపరేటర్‌నే అడగండి
ఇవన్నీ చేసినా కూడా మీ మొబైల్‌కు నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యగానే ఉంటే మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌ను సంప్రదించండి. వాళ్లు మీరుండే ప్రాంతంలో ఏదైనా నెట్‌వర్క్ ప్రాబ్లం ఉందేమో చెక్ చేస్తారు. సమస్యను మీరు చెప్పారు కాబట్టి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్లదే. కొన్ని కంపెనీలు మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే రిమోట్ పద్ధతిలో అక్కడి నుంచే సెట్ చేస్తారు. కాబట్టి ఫోన్‌ను ఇంటర్నెట్‌తో కనెక్టివ్‌గా ఉంచండి.